సంక్రాంతి హ్యాట్రిక్ నాదే అంటోన్న డైరెక్టర్  

Anil Ravipudi Sarileru Neekevvaru F2 F3 - Telugu Anil Ravipudi, F2, F3, Sarileru Neekevvaru, Telugu Movies

టాలీవుడ్‌లో ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలను చాలా ప్రత్యేకమైనవిగా చూస్తారు ప్రేక్షకులు.ఈ సీజన్‌లో వచ్చే సినిమాలను అంత ప్రెస్టీజియస్‌గా తీసుకోవడమే కాకుండా కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే అది చిన్నదైనా పెద్దదైనా సక్సెస్‌ను కట్టబెడతారు.

 Anil Ravipudi Sarileru Neekevvaru F2 F3

ఇలాంటి కోవలో చిన్న డైరెక్టర్స్ నుండి స్టార్ డైరెక్టర్స్ వరకు అందరూ తమ సినిమాలు ఉండేలా చూసుకుంటారు.

ఇక ఒక్కసారి సంక్రాంతి బరిలో సక్సెస్ అందుకున్న దర్శకుడు మరో సంక్రాంతి సీజన్‌లో కూడా సక్సెస్ అందుకుంటే ఆ డైరెక్టర్‌పై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

సంక్రాంతి హ్యాట్రిక్ నాదే అంటోన్న డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఇలాంటి ఫీట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి సాధించాడు.గతేడాది ఎఫ్2 చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్న అనిల్, ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంటి డబుల్ సక్సెస్‌ను అందుకున్నాడు.

ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని రెడీ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇప్పటికే ఎఫ్3 సినిమాకు సంబంధించిన స్ర్కిప్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసి సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ ఖచ్చితంగా నటిస్తున్నాడని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anil Ravipudi Eyes On Sankranthi Hatrick Related Telugu News,Photos/Pics,Images..