'ఎఫ్‌2' దర్శకుడి తర్వాత మూవీ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు  

Anil Ravipudi Remuneration For Mahesh Babu Movie-mahesh Babu 25th Movie

చేసినవి కొన్ని సినిమాలే అయినా దర్శకుడు అనీల్‌ రావిపూడి స్టార్‌ అయ్యాడు. ముఖ్యంగా మొన్న సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్‌ 2’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో ఆ చిత్రం వసూళ్లు రాబట్టింది. 100 కోట్ల షేర్‌ దక్కించుకున్న ఎఫ్‌ 2 చిత్రం వల్ల నిర్మాత దిల్‌రాజుకు 80కోట్ల వరకు లాభాలు దక్కాయి. అనీల్‌ రావిపూడి గత చిత్రాలకు కూడా భారీ మొత్తంలో నిర్మాతలు లాభాలు దక్కించుకున్నారు..

'ఎఫ్‌2' దర్శకుడి తర్వాత మూవీ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు-Anil Ravipudi Remuneration For Mahesh Babu Movie

అందుకే ఈయన దర్శకత్వంలో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అనీల్‌ రావిపూడి త్వరలో అనీల్‌ సుంకర దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సమయంలోనే అనీల్‌ రావిపూడి ఈ చిత్రంకు తీసుకోబోతున్న పారితోషికం విషయంలో సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనీల్‌ రావిపూడి ఈ చిత్రంకు ఏకంగా 13 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నాడట. అడ్వాన్స్‌గా మూడు కోట్లు దక్కగా సినిమా ప్రారంభం అయ్యే సమయంకు అయిదు కోట్లు ఆ తర్వాత అయిదు కోట్ల రూపాయలు దర్శకుడు తీసుకోనున్నాడు..

అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు చేయబోతున్న సినిమాకు ‘వాట్సప్‌’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా ఉన్న మహేష్‌బాబు ఆ వెంటనే వాట్సప్‌ను మొదలు పెట్టబోతున్నాడు.

ఇదే ఏడాది లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా నిర్మాత అనీల్‌ సుంకర ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం మహేష్‌ బాబు ఏకంగా 35 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు అనే టాక్‌ కూడా వస్తోంది. మొత్తానికి పారితోషికాలే 50 కోట్లకు పైగా ఉండేలా ఉన్నాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.