మహేష్‌కు నో చెప్పిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?  

Anil Ravipudi Rejects Mahesh Babu Offer - Telugu Anil Ravipudi, Mahesh Babu, Sarileru Neekevvaru, Telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 Anil Ravipudi Rejects Mahesh Babu Offer

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో చేయాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అటకెక్కేసింది.

మహేష్‌కు నో చెప్పిన డైరెక్టర్.. ఎవరో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక వెంటనే మహేష్ తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం దర్శకుడు పరశురాంతో చేయనున్నట్లు తెలిపాడు.అయితే ఇప్పట్లో ఈ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు.

ప్రస్తుతం పరశురాం అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.దీంతో మహేష్ ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేయాల్సిందిగా ఓ డైరెక్టర్‌ను కోరగా, ఆయన మహేష్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట.

మహేష్‌కు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్‌బస్టర్ అందించిన అనిల్ రావిపూడి, మళ్లీ అవకాశం దొరికితే మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పాడు.దీంతో మహేష్ మూడు నెలల్లో తనతో ఓ సినిమా చేయాల్సిందిగా కోరాడు.

అయితే మరీ మూడు నెలల్లో సినిమా అంటే కష్టమని, కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని అనిల్ రావిపూడి అనుకున్నాడు.అందుకే మహేష్ ఇచ్చిన ఆఫర్‌కు నో చెప్పాడట.

మరి మహేష్ తన నెక్ట్స్ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు