సమంతతో లేడీ ఒరియంటెడ్ ని లైన్ లో పెట్టిన అనిల్ రావిపూడి

కమర్షియల్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ రేస్ లోకి దూసుకొచ్చిన టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి.వరుసగా ఐదు హిట్ సినిమాలతో అనిల్ మంచి జోరు మీద ఉన్నాడు.

 Anil Ravipudi Plan Female Centric Story With Samantha, Tollywood, Shaakunthalam-TeluguStop.com

ప్రేక్షకుల నాడిని కరెక్ట్ గా ఎలాంటి అంశాలు ఉంటే సినిమా హిట్ అవుతుంది అనే విషయాన్ని లెక్కలు వేసుకొని ఫన్, యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు.తాను తీసే ప్రతి సినిమాలో ఫన్ మిస్ కాకుండా చూసుకుంటూ రొటీన్ కథలనే కాస్తా కొత్తగా చెప్పే ప్రయత్నం అనిల్ రావిపూడి చేస్తున్నాడు.

హీరో క్యారెక్టర్ బ్యాగ్రౌండ్ కంప్లీట్ గా మార్చేసి స్క్రీన్ ప్లేని సిద్ధం చేసుకొని ప్రేక్షకులని రెండు గంటలు థియేటర్ లో కూర్చోబెడుతున్నాడు.సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ స్టార్ మహేష్ కి సాలిడ్ హిట్ ని అనిల్ అందించాడు.

ప్రస్తుతం ఎఫ్2కి సీక్వెల్ గా ఎఫ్3 మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ఇప్పటికే రవితేజకి రాజా ది గ్రేట్ మూవీ సీక్వెల్ కథని నేరేట్ చేయడంతో పాటు బాలయ్యకి కూడా అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ యాక్షన్ జోనర్ లో స్టొరీని వినిపించి ఒకే చేయించుకున్నాడని తెలుస్తుంది.ఇలా రెండు ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టి ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ కథని స్టార్ హీరోయిన్ సమంతాకి నేరేట్ చేసి ఫైనల్ చేయించుకున్నాడని బోగట్టా.

అవకాశాన్ని బట్టి తక్కువ టైంలో సమంతా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి తరువాత రవితేజ, లేదంటే బాలయ్య సినిమాని స్టార్ట్ చేయాలని అనిల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే చాల సందర్భాలలో అనిల్ తక్కువ బడ్జెట్ లో ఒక లేడీ ఒరియాంటెడ్ మూవీ చేస్తానని చెప్పాడు.

ఇప్పుడు అవకాశం చూసుకొని దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు బోగట్టా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube