బాలయ్య తో అనిల్ చేయబోతుంది మల్టీస్టారర్ సినిమా అట !

అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ తోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు.ఈయన తీసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా అవ్వలేదు.

 Anil Ravipudi Multi Starer Movie With Balakrishna, Balakrishna, Anil Ravipudi, M-TeluguStop.com

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు అనిల్.ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి F2 సినిమాకు సీక్వెల్ గా F3 సినిమా చేస్తున్నాడు.విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.

అందుకే అనిల్ ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.అనిల్ ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అనిల్ రావిపూడి బాలయ్యకు ఇప్పటికే కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడని టాక్ నడుస్తుంది.అయితే ఈయన తెరకెక్కించే సినిమాలన్నీ ఇప్పటి వరకు కామెడీ జోన్ తోనే తెరకెక్కించాడు.

అటు బాలయ్య చుస్తే ఫుల్ యాక్షన్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు.అందుకే వీరి కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Telugu Akhanda, Anil Ravipudi, Anilravipudi, Balakrishna, Boyapati Srinu, Kalyan

అయితే ఇప్పుడు వీళ్ళ సినిమాపై ఒక వార్త వైరల్ అవుతుంది.ఇది ఏంటంటే బాలయ్య తో అనిల్ తీయాలనుకునే సినిమాలో ఇంకో హీరోకు కూడా ఛాన్స్ ఉందట.దీంతో ఈ సినిమా మల్టీస్టారర్ అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.అంతేకాదు ఆ సెకండ్ హీరోగా కళ్యాణ్ రామ్ నటించబోతున్నట్టు కూడా గాసిప్ నడుస్తుంది.ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ నందమూరి అభిమానులు మాత్రం ఖుషీగా ఉన్నారు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ తో అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో బాలయ్య కనిపించదు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube