బాలయ్యతో యంగ్ డైరెక్టర్ సినిమా.. అందుకేనట!  

Anil Ravipudi Movie With Balakrishna Before F3, Anil Ravipudi, F3, Balakrishna, Boyapati Sreenu - Telugu Anil Ravipudi, Balakrishna, Boyapati Sreenu, F3

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను బోయపాటి చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.

 Anil Ravipudi Movie With Balakrishna Before F3

దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

కాగా సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

బాలయ్యతో యంగ్ డైరెక్టర్ సినిమా.. అందుకేనట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు ఎప్పటినుండో చూస్తున్నాడు.

కానీ ఎఫ్3 చిత్రం కోసం అనిల్ రావిపూడి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.అయితే ఇప్పుడు ఎఫ్ 3 చిత్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవుతుండటంతో బాలయ్యతో సినిమా చేసేందుకు మరోసారి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఓ స్టోరీలైన్‌ను రాసుకున్న అనిల్, దాన్ని త్వరలో బాలయ్యకు వినిపించి, కథను పూర్తిగా రెడీ చేయాలని చూస్తున్నాడు.

ఏదేమైనా బాలయ్యతో అనిల్ రావిపూడి ఎలాంటి సినిమాను తీస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇటీవల మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అంటూ అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందకున్న ఈ డైరెక్టర్, బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి అనిల్ కథకు బాలయ్య ఎంతమేర ఇంప్రెస్ అవుతాడో, ఆయనతో సినిమాను బాలయ్య ఓకే చేస్తాడో లేడో చూడాలి.

#Boyapati Sreenu #F3 #Anil Ravipudi #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anil Ravipudi Movie With Balakrishna Before F3 Related Telugu News,Photos/Pics,Images..