సూపర్ హిట్ దర్శకుడుతో అఖిల్ సినిమా

అక్కినేని నాగార్జున వారసుడుగా టాలీవుడ్ లో హీరోగా తెరంగేట్రం చేసి ఇప్పుడు వరకు మూడు సినిమాలు చేసిన కూడా సక్సెస్ అందుకోలేక సతమతం అవుతున్న హీరో అఖిల్.స్టైలిష్ గా హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా కూడా స్టొరీ సెలక్షన్ లో తేడా వలన ఈ కుర్ర హీరో ఫెయిల్ అవుతున్నాడు.

 Anil Ravipudi To Team Up With Akhil Akkineni, Akkineni Family, Tollywood, Anil R-TeluguStop.com

ప్రేమ కథలు చేయాల్సిన వయసులో యాక్షన్ సినిమాలు అంటూ మొదటి రెండు సినిమాలలో ప్రయత్నం చేసి దెబ్బ తిన్న అఖిల్ మూడో సినిమాకి రొటీన్ లవ్ స్టొరీని ఎంపిక చేసుకొని దెబ్బ తిన్నాడు.ఇప్పుడు ఆశలన్నీ పూజా హెగ్డే మీద పెట్టుకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అంటూ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతూ ఉండటం వలన ఈ సారి హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత కేర్ ఫుల్ గా అఖిల్ ఉన్నాడు.

అందుకే తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూకుడు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.ప్రస్తుతం హిట్ అవసరమైన అఖిల్ అనిల్ రావిపూడితో పూర్తి హిల్లేరియస్ కామెడీ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఈ సినిమా అప్పట్లో నాగార్జున నటించిన అల్లరి అల్లుడు, ప్రెసిడెంటు గారి పెళ్లాం తరహాలో ఉంటుందని చెబుతున్నారు.ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న అఖిల్ ఇపుడు పూర్తిస్థాయి ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ తో సినిమా చేయాలని అనుకోని అనిల్ రావిపూడితో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం.తొలి సినిమా తరువాత అనిల్ రావిపూడి వరసగా దిల్ రాజు బ్యానర్‌లోనే సినిమాలు చేస్తున్నాడు.ఇపుడు అఖిల్‌తో చేయబోయే సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నాడు.ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో కూడా ఓ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube