అనిల్ సినిమాను మిస్ చేసుకున్న దిల్ రాజు.. కారణం అదేనా?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వరుస హిట్ సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ గా మారిపోయారు.

 Anil Ravipudi Miss The Movie Dil Raju , Dil Raju, Anil Ravipudi , Balakrishna ,-TeluguStop.com

ఈయన తెరకెక్కించిన పటాస్ మొదలుకుని ఈ మధ్యన వచ్చిన ఎఫ్ 3 సినిమా వరకు అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి.సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాడు.

ఇటీవలే ఈయన తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.ఇది కూడా హిట్ అందుకుంది.ఇక ఈయన తెరకెక్కించిన పటాస్ సినిమా నుండి దిల్ రాజు తో ఈయన ప్రయాణం స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా ఈయన నిర్మించక పోయిన పంపిణీ చేసారు.

ఆ సినిమా తో వీరి స్నేహం స్టార్ట్ అవ్వగా అప్పటి నుండి అనిల్ తీసే అన్ని సినిమాలను దిల్ రాజు నిర్మిస్తూ వస్తున్నారు.

సుప్రీం సినిమా నుండి అనిల్ రావిపూడి బయట నిర్మాతలతో పని చేయలేదు.

అలా అనిల్ సినిమాలకు ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా పరోక్షంగా కూడా దిల్ రాజు సపోర్ట్ ఇచ్చారు.అయితే మొదటిసారి వీరిద్దరూ కలసి సినిమా చేయడం లేదు.ప్రెసెంట్ అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

Telugu Anil Ravipudi, Anilravipudi, Balakrishna, Dil Raju, Nbk-Movie

అయితే ఈ సినిమాతో అనిల్ తొలిసారి దిల్ రాజు లేకుండా సినిమా చేస్తున్నాడు.అందుకు కారణం ఏంటా అని అంతా ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.ఈ సినిమాను షైన్ స్క్రీన్ వారు తెలివిగా దిల్ రాజు ను పక్కకు తప్పించారని తెలుస్తుంది.అనిల్ చివరి వరకు దిల్ రాజు ఉండాల్సిందే అని పట్టుబట్టిన వర్కౌట్ కాలేదని తెలుస్తుంది.

ఇది అసలు విషయం.ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube