బాబు అనీల్‌ నీకు అంత సీన్‌ లేదు తెలుసుకోమ్మా..!

దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, చిన్నా చితకా సినిమాలు చేసి ఎఫ్‌ 2తో సూపర్‌ హిట్‌ అందుకున్న అనీల్‌ రావిపూడి ఏకంగా సూపర్‌ స్టార్‌ నుండి పిలుపు అందుకున్నాడు.సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాను అంటూ చాలా నమ్మకంగా చెబుతున్న అనీల్‌ రావిపూడి తన కామెడీతో ఒక మంచి దర్శకుడిగా పేరు దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు.

 Anil Ravipudi Mahesh Babu Vijayashanthi Sarileru Nikevvaru Rashmika-TeluguStop.com

ఎఫ్‌ 2 చిత్రంను కామెడీతోనే నడిపించిన దర్శకుడు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా మంచి కామెడీతో నింపేసినట్లుగా చెబుతున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనీల్‌రావిపూడి మాట్లాడుతూ.

సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు.అదే విధంగా తన సినిమాలోని కామెడీ జంధ్యాల గారి కామెడీని పోలి ఉంటుందని, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి కూడా జంధ్యాల గారిని ఫాలో అవుతూ ఆయన సినిమాలు చూశాను.

ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని అంటూ అనీల్‌ రావిపూడి చెప్పుకొచ్చాడు.

Telugu Anil, Anil Ravipudi, Mahesh Babu, Rashmika, Vijayashanthi-

అనీల్‌ రావిపూడి తన కామెడీని జంధ్యాల కామెడీతో పోల్చుకోవడంపై నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.నీకు అంత సీన్‌ ఉందా? నీ సినిమాలోని కామెడీకి జంధ్యాల కామెడీకి ఎక్కడైనా సంబంధం ఉంటుందా, అసలు అంత మాట అనేందుకు నీకు నోరు ఎలా వస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.అలాగే మహేష్‌ బాబు ఛాన్స్‌ ఇచ్చినంత మాత్రాన మెగాస్టార్‌ చిరంజీవి నీకు ఛాన్స్‌ ఇస్తాడని అనుకుంటున్నావా అంటూ కూడా కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి అనీల్‌ రావిపూడి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో ఘాటు చర్చ అయితే జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube