అనీల్‌కు కూడా హామీ ఇచ్చాడట  

Mahesh Babu Give The Another Chance To Anil Ravipudi - Telugu Mahesh Babu, Mahesh Babu And Vamshi Paidi Pally, Mahesh Babu Sarileru Nikevvaru

మహేష్‌బాబు 25వ చిత్రం మహర్షికి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లితో మరోసినిమాను చేసేందుకు మహేష్‌బాబు ఓకే చెప్పిన విషయం తెల్సిందే.మహేష్‌బాబు త్వరలో చేయబోతున్న సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.

Mahesh Babu Give The Another Chance To Anil Ravipudi

వంశీ సినిమా తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న సినిమా కూడా అప్పుడే కన్ఫర్మ్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది.సరిలేరు నీకెవ్వరు వంటి కమర్షియల్‌ సక్సెస్‌ను ఇచ్చినందుకు గాను మహేష్‌బాబు వెంటనే అనీల్‌ రావిపూడికి మరో ఛాన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెల్సిందే.దూకుడు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇలాంటి కంప్లీట్‌ మాస్‌ మసాలా సినిమాను ఇచ్చినందుకు గాను అనీల్‌ రావిపూడికి మహేష్‌బాబు కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఈ సందర్బంగా మహేష్‌బాబు మాట్లాడుతూ అనీల్‌ రావిపూడికి కృతజ్ఞతలు.ఆయనతో మరో సినిమాను చేయాలని భావిస్తున్నాను.త్వరలోనే అనీల్‌ రావిపూడితో సినిమా చేస్తానంటూ మహేష్‌బాబు చెప్పుకొచ్చాడు.అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు చేయబోతున్న సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది.

తాజా వార్తలు

Mahesh Babu Give The Another Chance To Anil Ravipudi-mahesh Babu And Vamshi Paidi Pally,mahesh Babu Sarileru Nikevvaru Related....