ఆ హీరోకు నేనెప్పటికీ కృతజ్ఞుడినే : అనిల్ రావిపూడి

టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా కెరీర్ ను ప్రారంభించి దర్శకునిగా వరుస విజయాలను అందుకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి.కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ సినిమాతో దర్శకునిగా అనిల్ కెరీర్ ప్రారంభమైంది.

 Anil Ravipudi Interesting Comments About Kalyan Ram, Anil Ravipudi, Kalyan Ra, .-TeluguStop.com

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

పటాస్ సినిమా తరువాత అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు దర్శకత్వం వహించారు.

సినిమాసినిమాకు రేంజ్ తో పాటు మార్కెట్ ను పెంచుకున్న అనిల్ రావిపూడి పుట్టినరోజు నేడు.పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అనిల్ రావిపూడి అనేక విషయాలను పంచుకున్నారు.

హీరో కళ్యాణ్ రామ్ కు తాను ఎప్పుడూ కృతజ్ఞుడినేనని అనిల్ తెలిపారు.

Telugu Anil Ravipudi, Kalyan Ram, Dil Raju, Mahesh Babu-Movie

కళ్యాణ్ రామ్ తనపై పెట్టుకున్న నమ్మకమే పటాస్ సినిమా అని.ఆ సినిమా కథను నమ్మి హీరోగా నటించడంతో కళ్యాణ్ రామ్ నిర్మించారని తెలిపారు.ఆ సినిమా సక్సెస్ తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చారు.తనకు ఉన్న పరిమితుల్లోనే పటాస్ సినిమాను రిచ్ గా తెరకెక్కించానని. దిల్ రాజు, శిరీష్, వినాయక్ సినిమా చూసి ప్రశంసించారని అన్నారు.తాను వెంకటేష్ కు చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నని వెంకటేష్ డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు.

ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు నిర్మాతలకు భారీ లాభాలొచ్చాయని అనిల్ రావిపూడి తెలిపారు.కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని.హీరోలు, నిర్మాతలు నమ్మడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అనిల్ రావిపూడి వెల్లడించారు.వచ్చే నెలలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube