Anil Ravipudi Balakrishna : నేను గొప్ప దర్శకుడిని కాదు.. కానీ ఆ విషయంలో నిరాశ పర్చను

అపజయం లేకుండా దూసుకు పోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య తో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు.నేడు ఆయన పుట్టిన రోజు.

 Anil Ravipudi Interesting Comments About His Films , Anil Ravipudi Interesting C-TeluguStop.com

ఈ సందర్భంగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.పెద్ద ఎత్తున బాలయ్య యొక్క అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏమాత్రం తగ్గకుండా కథను సిద్ధం చేశాను అంటూ పేర్కొన్నాడు.

వచ్చే నెలలో సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు మొదలు అవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు.ఇక తాను ఒక గొప్ప దర్శకుడిగా నేను అనుకోవడం లేదు.

అయితే నా సినిమా లను చూసేందుకు వచ్చే ప్రేక్షకులను మరియు నాతో సినిమాలు తీసే నిర్మాతలను మరియు నాకు డేట్లు ఇచ్చి నన్ను నమ్మి నా సినిమా లో హీరోగా నటించిన వారిని మాత్రం నిరాశ పర్చను అన్నట్లుగా అనిల్‌ రావిపూడి పేర్కొన్నాడు.

నా యొక్క సినిమా ల్లో పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ పెట్టి.

లోకాన్ని ఉద్దరించే విధంగా సన్నివేశాలు తీయను అన్నట్లుగా పేర్కొన్నాడు.సమాజాన్ని చెడ్డ దారిలో నడిపించే విధంగా సినిమాలు ఉండవు అన్నట్లుగా తెలియజేశాడు.

సక్సెస్ మరియు ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా అనిల్ రావిపూడి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు.ఎఫ్‌ 3 సినిమా ఆయన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేదు.

అయినా కూడా మంచి సినిమా.ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించే సినిమా అన్నట్లుగా మాత్రం పేరును దక్కించుకుంది.

అనిల్ రావిపూడి యొక్క సినిమాలు ముందు ముందు కూడా కచ్చితంగా ఎంటర్ టైన్మెంట్‌ ను మాత్రమే అందించే విధంగా ఉంటుందని పేర్కొన్నారు.బాలయ్య తో అనిల్ చేయబోతున్న సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో లేదా దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube