బాలకృష్ణలో ఫన్ ఏలిం ఎలిమెంట్ ని బయటకి తెస్తా అంటున్న అనిల్ రావిపూడి

నందమూరి బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో డైలాగ్స్ చెప్పగల సామర్ధ్యం ఉన్న నటుడుగా పేరుంది.బోయపాటి అయితే బాలకృష్ణని ఏకంగా తన సినిమాలతో యాక్షన్ హీరో చేసేశాడు.

 Anil Ravipudi Fun Genre Movie With Balakrishna-TeluguStop.com

బాలయ్య అభిమానులు అతన్ని ఇలానే చూడాలని అనుకుంటున్నారు అంటూ సింహ, లెజెండ్, ప్రస్తుతం అఖండ సినిమాలతో పవర్ ఫుల్ యాక్షన్ హీరోయిజం బాలయ్యలో నింపేశాడు.ఇక గతంలో సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు సినిమాలు కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చి ట్రెండ్ సెట్ చేశాయి.

ఈ నేపధ్యంలో బాలకృష్ణకి యాక్షన్ ఎక్కువగా షూట్ అవుతుందని మిగిలిన దర్శకులు కూడా అలాగే అతన్ని ప్రెజెంట్ చేయడం మొదలు పెట్టారు.ఈ కారణంగానే కామెడీ పండించడంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సక్సెస్ అయినట్లు బాలకృష్ణ సక్సెస్ కాలేకపోయాడు.

 Anil Ravipudi Fun Genre Movie With Balakrishna-బాలకృష్ణలో ఫన్ ఎలిమెంట్ ని బయటకి తెస్తా అంటున్న అనిల్ రావిపూడి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని సినిమాలలో ఫన్ జెనరేట్ చేసే పాత్రలు చేసిన ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో బాలకృష్ణతో కామెడీ వర్క్ అవుట్ కాదని అందరూ ఫిక్స్ అయిపోయారు.అయితే యంగ్ క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం బాలకృష్ణతో తాను కామెడీ చేయించి హిట్ కొడతానని గట్టిగా చెబుతున్నాడు.

ఇప్పటి వరకు అనిల్ రావిపూడి సినిమాలు అన్ని కూడా ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గానే వెళ్ళాయి.హీరో పాత్రలు కూడా ఫన్ క్రియేట్ చేసేవిగానే ఉంటాయి.

ఈ నేపధ్యంలో బాలకృష్ణ కోసం తన స్టైల్ లో ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథనే సిద్ధం చేసుకొని ఒప్పించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బాలకృష్ణ అఖండతో పాటు నెక్స్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి ఫన్ యాక్షన్ సినిమా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

మరి ఇప్పటి వరకు బాలకృష్ణతో ఏ దర్శకుడు జెనరేట్ చేసి సక్సెస్ అందుకోలేకపోయిన ఫన్ జోనర్ లో బాలకృష్ణకి ఎంత వరకు హిట్ ఇస్తాడనేది చూడాలి.

#Balakrishna #Anil Ravipudi #Nandamuri Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు