'ఎఫ్‌ 3' సైలెన్స్ ను బ్రేక్ చేసేది అప్పుడేనా?

వెంకటేష్‌ మరియు వరుణ్ లు కలిసి నటించిన ఎఫ్‌ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా తర్వాత అనీల్ రావిపూడి మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

 Anil Ravipudi F3 Movie Release Date News-TeluguStop.com

ఆ సినిమా కు సీక్వెల్ గా రూపొందుతున్న ఎఫ్‌ 3 ని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని భావించారు.కాని కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది.

ఆగస్టులో విడుదల అవ్వాలనుకున్న సినిమాలు కొత్త తేదీని వెదుక్కున్నాయి.కాని ఇప్పటి వరకు ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన రిలీజ్ అప్‌ డేట్‌ ను ఇవ్వడం లేదు.

 Anil Ravipudi F3 Movie Release Date News-ఎఫ్‌ 3’ సైలెన్స్ ను బ్రేక్ చేసేది అప్పుడేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంక్రాంతికి విడుదల చేస్తారేమో అంటూ కొందరు భావించినా కూడా జక్కన్న మూవీ విడుదల ఉండటంతో పాటు ఇప్పటికే అక్కడ మూడు పెద్ద సినిమాలు పీక్కోలేక లాక్కోలేక అన్నట్లుగా ఉన్నాయి.కనుక ఎఫ్‌ 3 ని సంక్రాంతికి విడుదల చేయడం లేదు.

Telugu Anil Ravipudi, F3, Film News, Varun Tej, Venkatesh-Movie

ఎఫ్ 3 సినిమా తాజాగా హైదరాబాద్‌ షెడ్యూల్ ను ముగించారు.భారీ ఎత్తున కాస్టింగ్‌ తో రూపొందుతున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ ను వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నారు.దీపావళికి సినిమాకు సంబంధించిన కీలక అప్‌ డేట్‌ ను ఇవ్వడం కోసం యూనిట్‌ సభ్యులు వెయిట్‌ చేస్తున్నారట.విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్‌ 3 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆపాల్సిందే అంటున్నారు.

అందుకే విడుదల తేదీ విషయంలో ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఎఫ్ 3 సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ వరకు ముగించేలా ప్లాన్‌ చేస్తున్నారు.ఇప్పట్లో విడుదల కు అవకాశం లేకపోవడం వల్లే మెల్లగా సినిమా ను షూట్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమా ను చేస్తూనే దర్శకుడు అనీల్‌ రావిపూడి మరో ప్రాజెక్ట్‌ ను కూడా పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అలాగే పవన్ కళ్యాణ్ కు కూడా ఈయన కథ వినిపించాడని అంటున్నారు.

#Venkatesh #Varun Tej #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube