కెరీర్‌ ప్లానింగ్ విషయంలో అనీల్‌ రావిపూడిని ఫాలో అవ్వాలట.. ఎందుకంటే!

దర్శకులు సక్సెస్‌ దక్కించుకున్నా కూడా వారి తదుపరి సినిమాల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.సుకుమార్‌ మరియు కొటరాల శివ వంటి వారు స్టార్‌ దర్శకులు కూడా గ్యాప్‌ తీసుకోవాల్సి వస్తుంది.

 Anil Ravipudi Doing One By One Movie With Star Heros-TeluguStop.com

వారు ఇష్టం లేకుండనే గ్యాప్‌ ను తీసుకుంటున్నారు.కెరీర్ ను ప్లాన్‌ చేసుకోవడం లో యంగ్ దర్శకులు అనీల్ రావి పూడిని ఆదర్శంగా తీసుకోవాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

అనీల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి వరుసగా సక్సెస్‌ లు దక్కించుకుంటూ వస్తున్నాడు.ఆయన సినిమాల కు ఎక్కువ గ్యాప్‌ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.

 Anil Ravipudi Doing One By One Movie With Star Heros-కెరీర్‌ ప్లానింగ్ విషయంలో అనీల్‌ రావిపూడిని ఫాలో అవ్వాలట.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత ఎడాది కరోనా వల్ల కాస్త ఆలస్యంగా సినిమాను తీసుకు వస్తున్నాడు.గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి తదుపరి సినిమా సినిమాను ఆగస్టులో తీసుకు రాబోతున్నాడు.

ఆ వెంటనే మొదలు పెట్టబోతున్న సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్‌ చేసుకున్నాడు.

ఎఫ్‌ 3 సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న అనీల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య తో సినిమాను తీసి విడుదల చేయబోతున్నాడు.

ఇప్పటికే బాలయ్య తో సినిమా ను కన్ఫర్మ్‌ చేసుకున్నాడు.ఒక వైపు ఎఫ్‌ 3 తీస్తూ మరో వైపు బాలయ్య తో సినిమా ను చేసేందుకు కమిట్ అయిన అనీల్ రావిపూడి జోరు మామూలుగా లేదు.

ఆయన వరుసగా సక్సెస్ లు దక్కించుకోవడం తో పాటు ఎక్కడ కూడా బ్రేక్‌ రాకుండా జాగ్రత్త పడటం నిజంగా అభినంద నీయం.అందుకే ఆయన్ను అంతా ఫాలో అవ్వాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా యంగ్‌ దర్శకులకు సూచిస్తున్నారు.

సక్సెస్‌ వచ్చిన వెంటనే స్టార్‌ హీరో కోసం వెయిట్‌ చేయకుండా అందుబాటులో ఉన్న హీరోతో సినిమా ను తీసి దాన్ని కూడా సక్సెస్‌ చేసుకుంటే కోరుకున్న దర్శకుడు అవకాశం ఇచ్చే వీలు ఉంటుంది.ఈ విషయాన్ని యంగ్‌ దర్శకులు అర్థం చేసుకోవాలి.

#AnilRavipudi #Anil Ravipudi #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు