అనసూయపై వచ్చిన ఆ రూమర్ నిజమే..! ఇదిగోండి ఇదే సాక్ష్యం..!  

బుల్లితెరకు గ్లామర్ సొగసులు అద్దిన క్రెడిట్ మొత్తం అనసూయకే చెందుతుంది.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా పరిచయమైన అనసూయ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ మరిన్ని ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ చేస్తుంది..రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఎందుకో ఈ మధ్య అనసూయపై ఫాన్స్ కి నెగటివిటీ పెరిగిపోయింది.

రెండు వారాలు అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ యాంకర్ గా వర్షిణి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. వర్షిణి యాంకరింగ్ చూసిన అభిమానులు అనసూయ వద్దు…వర్షిణినే ముద్దు అంటూ కామెంట్స్ చేసారు.

Anil Ravipudi Confirms Anasuya Item Song In F2 Movie-Anil F2 Movie Varun Tej Venkatesh

Anil Ravipudi Confirms Anasuya Item Song In F2 Movie

ఇక అసలు విషయానికి వస్తే…గతంలో అనసూయ సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అలాగే క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటించి ఆడియన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇప్పుడు తాజాగా అనసూయ గురించి ఓ రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’లో అనసూయ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది అనే వార్తా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ విషయమై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

Anil Ravipudi Confirms Anasuya Item Song In F2 Movie-Anil F2 Movie Varun Tej Venkatesh

అనసూయ తమ చిత్రం ‘ఎఫ్2’లో నటిస్తున్న విషయం నిజమే అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ‘ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్’‌లో అనసూయ అతిథి పాత్రతో పాటు ప్రత్యేక గీతంలో నటించబోతున్నట్లు తెలిపారు. ఈ పోస్టుపై అనసూయ కూడా స్పందించారు.

డైరెక్టర్ సర్ మీ సినిమాలో నన్ను తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీ వల్ల నా కోరికల లిస్టులో ఉన్న ఒకటి తీరినట్లయింది’ అంటూ అనసూయ ట్వీట్ చేశారు.