బాలయ్య తో పక్కా మాస్ మూవీ..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 Anil Ravipudi Balakrishna Mass Movie Details, Anil Ravipudi, Balaiah, Balakrishn-TeluguStop.com

పటాస్ నుండి రాబోతున్న F3 వరకు వరుసగా కామెడీ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ వస్తున్న అనీల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో చేస్తాడని తెలిసిందే.అయితే ఈ సినిమా అనీల్ రావిపుడి మార్క్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంటుందా లేదా బాలయ్య మార్క్ మాస్ మూవీగా వస్తుందా అని అభిమానుల్లో ఓ డౌట్ ఉంది.

లేటెస్ట్ గా దానికి క్లారిటీ ఇచ్చాడు డైరక్టర్ అనీల్ రావిపుడి.F3 ప్రమోషన్స్ లో భాగంగా అలితో సరదాగా షోకి వచ్చారు అనీల్ రావిపుడి, సునీల్.షోలో భాగంగా అనీల్ రావిపుడి కేవలం కామెడీ సినిమాలే చేస్తాడా అన్న ప్రశ్నకు సమాధానంగా నెక్స్ట్ సినిమా బాలయ్యతో ఉందిగా అది పక్కా మాస్ మూవీ అనేశాడు అనీల్ రావిపుడి.మొత్తానికి బాలయ్యతో కంప్లీట్ అనీల్ రావిపుడి మాస్ ఎంటర్టైనర్ చేస్తాడని అర్ధమవుతుంది.

బాలకృష్ణ 107వ సినిమా పూర్తి కాగానే అనీల్ రావిపుడి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube