ఎఫ్ 3 సినిమా( F3 Movie ) మినహా చేసిన ప్రతి ఒక్క సినిమా ను కూడా సూపర్ హిట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ తో మొదలు పెట్టి సరిలేరు నీకెవ్వరు వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనకు దక్కింది.
రాజమౌళి లాగా వరుసగా విజయాలు దక్కించుకుంటూ ఉన్నాడు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పాపం అనిల్ రావిపూడికి ఎఫ్ 3 తో గట్టి దెబ్బ పడింది.
ఆ బెబ్బ నుంచి కోలుకునేందుకు కొంత సమయం తీసుకున్న దర్శకుడు అనిల్ తన కథ తో బాలయ్య ను మెప్పించాడు.ఆ కథ తో వచ్చిందే భగవంత్ కేసరి సినిమా.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సినిమా 50 కోట్ల మార్క్ దాటి వంద కోట్ల వైపు కి పరుగులు తీస్తోంది.ఈ సమయంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి ని అంతా కూడా మళ్లీ గాడి లో పడ్డాడు అంటూ అభినందిస్తున్నారు.
తప్పకుండా అనిల్ రావిపూడా మరో సినిమా ను ఆ తర్వాత సినిమా లను కూడా హిట్ చేసుకుంటాడు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సోషల్ మీడియా( Social media ) లో ప్రస్తుతం అనిల్ రావిపూడి ( Anil Ravipudi )తదుపరి సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.అనిల్ రావిపూడి తదుపరి సినిమా ను రవితేజ తో చేసే అవకాశం కనిపిస్తోంది.వీరిద్దరి కాంబోలో రాజా ది గ్రేట్ సినిమా వచ్చింది.
మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా కి సీక్వెల్ చేయాలని అనిల్ కోరుకుంటున్నాడు.ఆ మధ్య స్టోరీ లైన్ ని కూడా రవితేజ కి చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.
కనుక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా ( Bhagavanth Kesari )హిట్ అవ్వగానే రవితేజ నుంచి పిలుపు వచ్చి ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.