నందమూరి ఫ్యాన్స్‌ కు ఉసూరుమనిపించే విషయం చెప్పిన అనిల్ రావిపూడి

కమర్షియల్‌ సినిమా ల దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న అనీల్ రావిపూడి ప్రస్తుతం వెంకీ మరియు వరుణ్‌ లతో ఎఫ్‌ 3 సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ మరో నెలన్నర రోజుల్లో షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉంది.

 Anil Ravipudi About Balakrishna And Kalyan Ram Movie-TeluguStop.com

కాని కరోనా కారణంగా నిలిచి పోయింది. దర్శకుడు అనీల్ రావిపూడికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో షూటింగ్ కు బ్రేక్‌ పడింది.

ఇక ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల ఆరంభం నుండి షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

 Anil Ravipudi About Balakrishna And Kalyan Ram Movie-నందమూరి ఫ్యాన్స్‌ కు ఉసూరుమనిపించే విషయం చెప్పిన అనిల్ రావిపూడి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్‌ 3 సినిమా ను ముందుగా అనుకున్నట్లుగానే ఆగస్టు లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

అనీల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ తో రామారావు గారు అనే సినిమా ను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.కాని ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది.దర్శకుడు అనీల్ స్వయంగా మీడియా తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

మీడియాలో వస్తున్నట్లుగా అసలు నందమూరి మల్టీ స్టారర్ సినిమా కోసం నేను ప్రయత్నాలు చేయడం లేదు.బాలయ్య మరియు కళ్యాణ్‌ రామ్‌ లతో నేను సినిమా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొన్నాడు.

అలాగే బాలయ్యతో సినిమా విషయమై కూడా స్పష్టత ఇచ్చాడు.నేను ఇప్పటి వరకు బాలయ్య బాబు తో సినిమా గురించి చర్చలు జరపలేదు.మీడియాలో వస్తున్న వార్తల గురించి నాకు తెలియదు అంటూ ఇండైరెక్ట్ గా బాలయ్య తో సినిమా ను కన్ఫర్మ్‌ చేయలేదని పేర్కొన్నాడు.బాలయ్య తో అనీల్ రావిపూడి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో అనూహ్యంగా బాలయ్య తో సినిమా లేదని అనీల్ చెప్పడంతో నందమూరి అభిమానులు ఉసూరుమంటున్నారు.

#Anil Ravi Pudi #NandamuriHeroes #AnilRavipudi #Balakrishna #BalakrishnaWith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు