థర్డ్ వేవ్ పై ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కీలక కామెంట్లు..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కరోనా థర్డ్ వేవ్ పై కీలక కామెంట్లు చేశారు.  వైద్య నిపుణుల హెచ్చరికల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థర్డ్ వేవ్ ఎదుర్కోవటానికి అప్రమత్తం అయిందని అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.

 Anil Kumar Singhal Sensatational Comments-TeluguStop.com

రాష్ట్రంలో 12 వేల ఆక్సిడెంట్ కాన్సంట్రేటర్లు రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.అంతమాత్రమే కాకుండా 10 వేల డి టైప్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రెడీ అయిందని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 113 ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలవటం జరిగింది అని పేర్కొన్నారు.థర్డ్ వేవ్ విషయంలో కేంద్రం మరియు నిపుణుల హెచ్చరికల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగానే ఆక్సిజన్ ఐసియు బెడ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెండు నెలల్లో వీటికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పుకొచ్చారు.

 Anil Kumar Singhal Sensatational Comments-థర్డ్ వేవ్ పై ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కీలక కామెంట్లు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇండియాలో థర్డ్ వేవ్ అక్టోబర్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  

.

#Corona #Andra Pradesh #Third Wave #ReadyTo #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు