ఇక నా దగ్గర ఏమి మిగల్లేదు: అనిల్ అంబానీ…!  

Anil Ambani Sold Wife Jewellery to pay Legal Fees, anil ambani, mukesh ambani, corporate industry, UK Court, Reliance industries - Telugu Anil Ambani, Anil Ambani Sold Wife Jewellery To Pay Legal Fees, Corporate Industry, Court, Mukesh Ambani, Reliance Industries, Uk Court

భారతదేశంలో సంపన్నుల పేరు చెబితే మొట్టమొదటిగా చెప్పే పేరు అంబానీ ఫ్యామిలీ గురించి.ధీరుబాయ్ అంబానీ మొదలుపెట్టిన సామ్రాజ్యాన్ని తన కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ ఆ వారసత్వాన్ని కాపాడుతూ వస్తున్నారు.

TeluguStop.com - Anil Ambani Sold All Assets Uk Court

అయితే కొన్ని నెలలుగా అన్న ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాలు విస్తరించుకుంటూ వెళ్తుంటే మరో వైపు తమ్ముడు అనిల్ అంబానీ పరిస్థితి దీనికి వ్యతిరేకంగా ఉంది.ప్రస్తుతం ఆయన పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అంతేకాదు, ప్రస్తుతం ఆయన కేవలం ఓ సాధారణ పౌరుడిగా జీవితం గడుపుతున్నారని తెలియజేశారు.

TeluguStop.com - ఇక నా దగ్గర ఏమి మిగల్లేదు: అనిల్ అంబానీ…-General-Telugu-Telugu Tollywood Photo Image

అనిల్ అంబానీ తనకు చట్టపరమైన విషయాల కొరకు ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసినట్లు తెలియజేశారు.

ప్రస్తుతానికి ఆయన ఒక సాధారణ జీవితం మాత్రమే గడుపుతున్నారు.తాజాగా ఆయనను యూకే హైకోర్టు విచారణకు పిలవగా ఆయన ఇండియా నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

ఈ సమావేశంలో అనిల్ అంబానీ ప్రస్తుతం ఆయన గడుపుతున్న జీవనశైలి, ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలను అలాగే అప్పుల వివరాలను కూడా తెలియజేశారు.అయితే అనిల్ అంబానీ యజమాన్యంలో మొదలైన ఆర్ కామ్ కు 925 మిలియన్ల డాలర్ల రికవరీ చేయడానికి అనేక బ్యాంకులు లండన్ లోని కోర్టును ఆశ్రయించాయి.

ఇక ఇలా అనేక బ్యాంకుల నుండి అనిల్ అంబానీ సంబంధించి ఆస్తులను బహిర్గతం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తులు అందాయి.దీనితో అనిల్ అంబాని ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపగా తప్పలేదు.

దీనితో ప్రస్తుతం గడుపుతున్న జీవితాన్ని తెలియజేస్తూ తనకున్న బకాయిలు చెల్లించేందుకు తన దగ్గర ఎలాంటి ఆస్తులు ఏమి లేవని అనిల్ అంబానీ చేతులెత్తేశారు.చివరికి తన కోర్టు ఖర్చుల కోసం తన భార్య దగ్గర ఉన్న నగలు కూడా అమ్మాల్సి వచ్చిందని బ్రిటన్ న్యాయస్థానానికి అనిల్ అంబానీ తెలియజేశారు.

భారతదేశంలో నెంబర్ వన్ ధనవంతుడు ఆయన ముఖేష్ అంబానీ కి స్వయానా సోదరుడైన అనిల్ అంబానీ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో పెద్ద చర్చనీయాంశ వార్త అయింది.చూడాలి మరి అనిల్ అంబానీ కేసు ఎంతవరకు వెళ్తుందో.

#Mukesh Ambani #Court #Anil Ambani #UK Court #AnilAmbani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anil Ambani Sold All Assets Uk Court Related Telugu News,Photos/Pics,Images..