దివాలా తీసిన రిలయన్స్.. రాజీనామా చేసిన అంబానీ

భారత ఆర్ధిక రంగంలో ఒక వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రస్తుతం కోలుకోలేని స్థితిలో మునిగిపోయింది.ఇప్పటికే ఆర్‌కామ్ వ్యాపారం దివాలా తీయడంతో తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవి నుండి అనిల్ అంబానీ రాజీనామా చేశారు.

 Anil Ambani Resigns As Reliance Communications Director-TeluguStop.com

భారీ నష్టాలలో ఉన్న ఆర్‌కామ్‌ను గట్టున పడేయడం తనవల్ల కాదంటూ అనిల్ అంబానీ నిర్ణయం తీసుకున్నాడు.తనతోపాటు కంపెనీ డైరెక్టర్లు ఛాయ విరాణి, రినా కరణి, మంజరీ కాకర్, సురేష్ రంగాచార్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

బకాయిలు చెల్లించలేక ఆర్‌కాం తన మొబైల్ కార్యకలాపాలని మూసివేసింది.కాగా ఐబీసీ నేతృత్వంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను వేలం వేయనుండగా వాటిని కొనుగోలు చేయాలని చూసే వారిలో రిలయన్స్ జియో కూడా ఒకటి.

మొత్తానికి ఒక వ్యాపార దిగ్గజం ఇలా దివాలా తీయడంతో జాతీయ మార్కెట్లపై ఈ ప్రభావం కనిపించనుంది.మరి ఆర్‌కామ్ కమ్యూనికేషన్స్ ఆస్తులను వేలంలో ఎవరు దక్కించుకుంటారు అనే అంశం వ్యాపార రంగాల్లో ఆసక్తిగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube