పెళ్లికొడుకు దెబ్బకు బిక్కమొహం వేసిన పెళ్లికూతురు

పెళ్లిలో వరుడు అలిగినప్పుడు వధువు తల్లిదండ్రులు, బావమరుదులు అతడిని బుజ్జగింజి పెళ్లిపీటలపై కూర్చోబెట్టడం మనం చూశాం.కొంతమంది పెళ్లికి సరైన ఏర్పాట్లు చేయకపోతే అలిగే వారు కూడా ఉన్నారు.

 Angry Groom Video Goes Viral In Social Media-TeluguStop.com

కానీ ఇక్కడ ఓ పెళ్లికొడుకు ఎందుకు మాడ్చుకున్నాడో ఎవ్వరికీ తెలియదు.కానీ అతగాడు చేసిన పనికి మాత్రం ఆ పెళ్లికూతురు బిక్కమొహం వేసుకుని నిల్చుంది.

అజర్ బైజాన్ దేశంలో జరిగిన ఓ పెళ్లిలో వరుడు ఏమాత్రం సంతోషంగా లేకుండా మొహంపై కోపంతో కనిపించాడు.పెళ్లి రిసెప్షన్‌లో కేకు కోసే సమయంలో అతగాడి రచ్చ చూసిన వారందరూ ముక్కన వేలేసుకున్నారు.

భార్యతో కలిసి సంతోషంగా కేకు కట్ చేయాల్సిన వ్యక్తి, దాన్ని కసితో కోసిపారేశాడు.ఇక స్నేహితులకు చాంపెయిన్ బాటిల్ మూత తీసి ఇవ్వమంటే అది కాస్త ఊపి వారిపై పోసే ప్రయత్నం చేశాడు.

కానీ అది సరిగా పడకపోవడంతో దాన్ని నేలకేసి కొట్టాడు.

ఇది చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు.

పెళ్లికొడుకు వింత ప్రవర్తనకు వారుముక్కున వేలేసుకుని సైలెంట్‌గా ఉండిపోయారు.ఇక పెళ్లి కూతురు మాత్రం బిక్కమొహం వేసుకుని నిల్చుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ పెళ్లికొడుకు ఏంటి బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube