ఈరోజు శ్రీవారి భక్తుల అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల.. ఇలా బుక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.అలా దర్శించుకుని వెళ్లే తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.

 Angapradakshina Tokens For Srivari Devotees Are Released Today Book Like This ,-TeluguStop.com

శ్రీవారి అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 24వ తేదీన విడుదల చేస్తున్నారు.మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ టోకెన్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

ఈ మేరకు టోకెన్ల విడుదలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది.శ్రీవారి దేవాలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణం టోకెన్లు జరి నీ నిలిపివేశామని అధికారులు వెల్లడించారు.

శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో టోకెన్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి కూడా చేశారు.అదే సమయంలో నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ అధికారిక వెబ్సైట్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం అధికారులు భక్తులకు సూచించారు.

స్వామి వారి దర్శనం కోసం సోమవారం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Telugu Andhra Pradesh, Bhakti, Devotional, Tirumala-Latest News - Telugu

ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది.ఇంకా చెప్పాలంటే ఆదివారం శ్రీవారిని దాదాపు 73000 మంది భక్తులు దర్శించుకున్నరని టిడిపి దేవస్థానం వెల్లడించింది.అంతే కాకుండా ఈ నెల 28న రథసప్తమి కోసం తిరుమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఆ రోజు ఏడు వాహనాల పై స్వామి వారు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది.సూర్య జయంతి సందర్భంగా నిర్వహించే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ఏర్పాట్లను చేస్తుంది.

మినీ బ్రహ్మోత్సవాలుగా పరిగణించే ఈ ఉత్సవాల కోసం భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని కూడా దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube