వైరల్ వీడియో: నదిలో వరదకు ఎదురీదుతూ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న అంగన్ వాడి వర్కర్...!

భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందటూ పెద్దలు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు.అయితే కొన్ని రంగాల్లో మాత్రమే భారతదేశం అభివృద్ధి కనబడుతుంది.

 Anganwadi Worker Swim Malgudi River Viral Video, Odisha, Anganwadi Worker, Hemal-TeluguStop.com

కొన్ని విషయాలతద మాత్రం అభివృద్ధి ఇంతవరకు ఎలా ఉందో, ప్రస్తుతం కూడా అలాగే కొనసాగుతుంది.దీనికి గల కారణం ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లాలో జరిగిన దృశ్యం కళ్లకు అద్దం పడుతున్నాయి.ఇకపోతే ఈ ఊరు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు లోకి చాలా దగ్గర్లోనే ఉంది.

మల్కన్ గిరి జిల్లాలోని నేరేడుపల్లి గ్రామ ప్రజలు వారి ఊరికి చేరుకోవాలంటే గోదావరి ఉప నది అయిన మాలిగూడ అనే నదిని దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది.అయితే వారు వారి ఊరికి ఎలా చేరతారో అన్న విషయం చూస్తే… నిజంగా మనము ఎంత సుఖంగా జీవిస్తున్నామో ఇట్టే అర్థమైపోతుంది.

వారు ఆ నదీ ప్రవాహాన్ని దాటుకొని మరి వారి ఊరికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ వీడియో చూస్తే నిజంగా మన ప్రాణాలు ఎంత సేఫ్ గా ఉన్నాయో తెలుస్తుంది.

మామూలుగా భీకరంగా ప్రవహిస్తున్న నది జోలికి వెళ్లడం అంటే చాలామంది భయపడతారు.అలాంటి పరిస్థితుల్లో కూడా ఓ అంగన్ వాడి కార్యకర్త హేమలత సీసా ఆ ఉదృతమైన నదిలో కూడా ఆ ప్రాంత స్థానికులతో కలిసి తన సేవలను వారికి అందించేందుకు ముందుకు వెళ్ళింది.

అయితే కేవలం ఆవిడ ఒక్కటే మాత్రమే కాదు ఆ ఊరి ప్రజలంతా కూడా ఆ నదిని దాటేందుకు అనేక ఇబ్బందులను పడాల్సిందే.వారి నడుములకు ప్లాస్టిక్ బిందెలను కట్టుకొని అతి భీకరముగా ప్రవహిస్తున్న ప్రవాహంలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి, కాలుజారి ప్రవాహంలో కొట్టుకు పోయిన ఇక అంతే సంగతులు.ఇంకా ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే నేరేడుమల్లికి చేరేందుకు బోట్స్ కూడా లేకపోవడమే.

ఇక ఆ ఊరికి చేరుకోవాలంటే కచ్చితంగా నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చు.కాకపోతే అంగన్ వాడి వర్కర్ తాను పది సంవత్సరాలుగా ఇలాగే పరిస్థితి ఎలా ఉన్నా సరే అక్కడికి చేరుకొని సేవలను అందిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి అంగన్వాడీ వర్కర్ ఆ గ్రామంలోని ఉండాల్సిన పరిస్థితులు కూడా లేకపోలేదు.అనేక సందర్భాలలో ఆ నదిని దాటుకుంటూ అవతలికి వెళ్లాల్సిన సమయంలో చాలామంది ఆ నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిన సంఘటనలు ఎన్నో కూడా ఉన్నాయట.

ఉదయం పూట పరిస్థితి ఇలా ఉంటే రాత్రి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని అంగన్ వాడి వర్కర్ తెలియజేసింది.కాకపోతే ఆ గ్రామంలో 400 మంది దాక నివసిస్తున్నారు.

ప్రస్తుతం వారు ఏ విధంగా నదీ ప్రవాహాన్ని దాటుకొని అవతలి ఒడ్డుకు చేరుతునారోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube