పాపం నటి.. గర్భవతి అని సినిమాల నుంచి తొలిగించేశారట!

బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్స్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎందరికో ఆదర్శంగా ఉన్న జంటలలో నేహా ధూపియా, అంగద్‌ బేడి జంట ఒకటి.ఎంతో అన్యోన్యంగా ఎందరికో ఆదర్శంగా ఉండే ఈ జంట సినీ కెరియర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

 Angad Bedi, Neha Dhupia,pregnancy, Bollywood,latest News Viral Social Media-TeluguStop.com

వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతున్న ఈ జంటకు ఇప్పటికే మెహర్ అనే కూతురు ఉంది.అయితే నేహా మరోసారి తల్లి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇదే విషయాన్ని నేహా గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా నేహా భర్త నటుడు అంగద్‌ బేడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేహ రెండోసారి గర్భం దాల్చడం వల్ల ఎన్నో ప్రాజెక్టులను కోల్పోయిందని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఎవరు కూడా తనని తన ఒప్పుకున్న ప్రాజెక్టులలో కొనసాగించకుండా తను గర్భవతి అని తెలియగానే తాను ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి తొలగించారు.

నా విషయంలో కూడా ఇలా ఎన్నోసార్లు జరిగిందని తెలిపారు.

Telugu Angad Bedi, Bollywood, Neha Dhupia, Pregnancy-Movie

అయితే ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వసాధారణమే కనుక అలా నిర్మాతలు తొలగించిన తర్వాత అంతకన్నా బెస్ట్ నిర్మాతల సినిమాలలో నటించే అవకాశం వచ్చిందని తెలియజేశారు.అయితే చాలామంది దర్శక నిర్మాతలు నేహా ప్రెగ్నెంట్ అని తెలియడంతో వారి ప్రాజెక్టుల నుంచి తప్పించినప్పటికీ గురువారం డెరెక్టర్‌ బెహజాద్ ఖంబాట స్క్రీన్‌పై గర్భిణి పోలీసుగా చూపించడం కోసం ఏకంగా స్క్రిప్ట్ లో మార్పులు చేశారని ఈ సందర్భంగా అంగద్‌ బేడి ఈ విషయాన్ని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈమెకు సంబంధించిన ఈ పోస్టర్ గతంలో విడుదల చేయగా చాలా మంది ఈమె పై ప్రశంసలు కురిపించిన మరికొందరు డబ్బు కోసం ఇలా తన జీవితాన్ని రిస్క్ చేయాల్సిన పని లేదంటూ కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube