ఆ హీరోను కుక్కతో పోల్చిన యూవీ     2018-11-14   08:37:10  IST  Ramesh P

టీం ఇండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు బాలీవుడ్‌లో మంచి స్నేహితులు ఉన్నారు. బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న యూవీ తాజాగా తన సోషల్‌ మీడియా పేజ్‌ లో కొంతమంది స్నేహితుల కంటే కుక్కలు నయం అంటూ పోస్ట్‌ చేశాడు. యూవీ అలా ఎందుకు పోస్ట్‌ చేశాడా అంటూ అంతా కూడా షాక్‌ అయ్యారు. అది ఎవరి గురించో అంటూ చర్చించుకున్నారు. యూవీని అంతగా మోసం చేసిన ఆ స్నేహితుడు ఎవరై ఉంటారా అంటూ అంతా అనుకున్నారు. యూవీని మోసం చేసింది తానే అంటూ బాలీవుడ్‌ హీరో అంగద్‌ బేడీ పేర్కొన్నాడు.

Angad Bedi Reveals Why Friend Yuvraj Singh Is Upset With Him-Angad's Marriage Neha Dhupia Yuvi Best

తాజాగా ఈ హీరో తన భార్య నేహా ధూపియా రన్‌ చేసే టాక్‌ షో నో ఫిల్టర్‌ నేహా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో యూవీతో తనకు ఉన్న స్నేహం, ఇప్పుడు ఇద్దరి మద్య వివాదంపై క్లారిటీ ఇచ్చాడు. యూవీ నాకు ఆప్త మిత్రుడు. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి పెరిగాం. ఇద్దరం ఒకరంటే ఒకరికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయితే తాజాగా నా గురించి యూవీ సోషల్‌ మీడియాలో అలా పోస్ట్‌ చేశాడు. యూవీ దృష్టిలో కుక్కను నేను. ఎందుకంటే ఆయన్ను నేను మోసం చేశాను. ఆ మోసం కారణంగా నేను నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Angad Bedi Reveals Why Friend Yuvraj Singh Is Upset With Him-Angad's Marriage Neha Dhupia Yuvi Best

నేహాతో అంగద్‌ వివాహం గత ఏడాది జరిగింది. ఆ వివాహం అత్యంత రహస్యంగా, ఎవరికి తెలియకుండా, ఎవరిని పిలవకుండా చేసుకోవాల్సి వచ్చింది. అందువల్లే ఆప్తమిత్రుడు అయిన యూవీని నేను పిలువలేక పోయాను. అందుకే యూవీ ఇంత కోపంగా ఉన్నాడు అంటూ అంగద్‌ చెప్పుకొచ్చాడు. పెళ్లికి పిలవకుంటే అంతగా కోపం ఉండదని, అది కూడా ప్రాణ స్నేహితుడు కనుక పెళ్లికి పిలువక పోయినా కూడా ఇంతగా విభేదాలు ఉండవని, యూవీని అంగద్‌ మోసం చేసి ఉంటాడని, మరేదో విషయం వీరిద్దరి మద్య ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో యూవీ టీం ఇండియా జట్టులో కనిపించడం లేదు. ఐపీఎల్‌ కే పరిమితం అయ్యాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.