ఇదంతా కేవలం మూడు వేల రూపాయలే అనీ మాస్టర్ పోస్ట్ వైరల్!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం అందరికి తెలిసిందే.

 Anee Master Bigg Boss Event Self Designed Saree Photo Viral, Anee Master ,bigg B-TeluguStop.com

ఈ సీజన్ లోని కంటెస్టెంట్ లు అందరూ కూడా తాజాగా ఒకచోట చేరారు.అయితే అందరూ కలసి ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

స్టార్ మా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లతో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈవెంట్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన యాంకర్ రవి, అని మాస్టర్, లోబో, సరయు,హమీద, శ్రీ రామచంద్ర, ప్రియ ఇలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు అందరూ కనిపించారు.

అయితే ఇందుకు సంబంధించిన షూటింగ్ రాత్రి పగలు అని తేడా లేకుండా కంటిన్యూగా జరిగిందట.ఇక తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో షూటింగ్ ఉంది అంటూ రవి, అనీ మాస్టర్ చెప్పుకొచ్చారు.

షూటింగ్ మధ్యలో పడుకున్న లోబో ని కూడా చూపించారు.లోబో నిద్రపోతున్న సమయంలో ఎలా డిస్టర్బ్ చేశారో కూడా చూపించింది అనీ మాస్టర్.

అందరూ ఉన్నా కూడా ఈ ఈవెంట్ లో షణ్ముఖ్ జస్వంత్, సన్నీ, సిరి, కాజల్ మాత్రం కనిపించలేదు.సిరి కరోనా వల్ల రాలేదని తెలుస్తోంది.

ఇకపోతే అనీ మాస్టర్ సొంతంగానే తన కాస్ట్యూమ్ తానే డిజైన్ చేసుకుందట.ఈ క్రమంలోనే అనీ మాస్టర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో గోల్డ్ కలర్ బ్లౌజ్, రెడ్ కలర్ సారీ కట్టుకుని కనిపించారు అని మాస్టర్.బిగ్ బాస్ ఈవెంట్ కోసం నాకు నేనే స్టైలింగ్ చేసుకున్నాను.చీర ఖరీదు 1200, జాకెట్ 1000, కుట్టడానికి 800 మొత్తం కలిపి 3000 అయింది అంతే.మొత్తం నాదే ఎవరితోనూ కొలాబరేషన్ అవ్వలేదు.అంటూ అని మాస్టర్ చెప్పుకొచ్చింది.అనీ మాస్టర్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ అనీ మాస్టర్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.క్యాప్షన్ అదిరిపోయింది అంటూ కామెంట్ కూడా పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube