అనీ మాస్టర్ మళ్ళీ అలిగిందోచ్.. ఆ ముగ్గురు కంటెస్టెంట్ల వల్లే అంతా!

బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరూ ఒకే చోట చేరారు అంటే ఆ సందడి ఏ లెవల్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో ఒకరికొకరు గొడవలు పడుతూ మాట్లాడకుండా ఉంటారు.

 Anee Master On Lahari Shari Anchor Ravi And Sreerama Chandra Video, Anee Master, Lahari, Sree Rama Chandra, Anchor Ravi-TeluguStop.com

కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసిమెలిసి ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లో అందరూ ఒకచోట చేరారు.

స్పెషల్ ఈవెంట్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరూ తెగ కష్టపడుతున్నారు.పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ నిర్విరామంగా జరుపుతున్నారు షో నిర్వాహకులు.

ఇక షూటింగ్ జరుగుతున్న క్రమంలో మధ్యమధ్యలో కంటెస్టెంట్ లు రెస్ట్ తీసుకోవడం, వీడియోలు తీయడం ఇలాంటివి చేస్తున్నారు.ఇక రవి,శ్రీరామచంద్ర లు అయితే ఎక్కువగా కలిసి హంగామా చేస్తున్నారు.

ఇద్దరూ ఒకే విధమైన డ్రెస్సింగ్ తో దుమ్ము లేపుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా లహరి, శ్రీ రామచంద్ర, రవి కలిసి రీల్ వీడియో చేశారు.

ఈ వీడియోలో ముగ్గురు కలసి మాస్ స్టెప్పులు వేశారు.చూడటానికి క్లాస్ లోపలంతా మాస్ అన్నట్టుగా రవి చెప్పుకొచ్చాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఈ వీడియోని చూసి అనీ మాస్టర్ చాలా హర్ట్ అయింది.మామూలుగా ఇలాంటి వీడియోలు చేయడంలో అనీ మాస్టర్ ముందు ఉంటుంది.

తనతో కలసి వీడియో చేయలేదని అనీ మాస్టర్ చాలా హర్ట్ అయింది.ఈ వీడియోపై అనీ మాస్టర్ స్పందిస్తూ.ఈ విషయంలో రవిని నిందిస్తూ.నువ్వు నాతో రీల్ వీడియో చేయలేదు అని హర్ట్ అయినట్టుగా కామెంట్ చేసింది.ఆ విషయంపై స్పందించిన రవి.తప్పకుండా చేస్తాను.ఇక చాలు అనేంత వరకు చేస్తాను అని కామెంట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ దొరకడంతో ఆ వీడియోని చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube