ఆండ్రాయిడ్ యూజర్లకు అలెర్ట్.. ఈ యాప్ ఫోన్ లో ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి..!

ఆండ్రాయిడ్ యూజర్లు ఏదైనా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లేస్టోర్ ని ఆశ్రయిస్తారు.ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారులందరూ కూడా డిఫాల్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

 Android Users Alert Uninstall Apk Pure App From Your Phone , Android Users, Aler-TeluguStop.com

కానీ కొందరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర యాప్ స్టోర్స్ లను ఆశ్రయిస్తుంటారు.అంతర్జాలంలో ఏపీకే మిర్రర్, ఏపీకే ప్యూర్, ఏపీకే ఫర్ ఫన్ వంటి ఎన్నో అప్లికేషన్లు, వెబ్ సైట్స్ గూగుల్ ప్లే స్టోర్ కి సరైన ప్రత్యామ్నాయం గా అందుబాటులో ఉన్నాయి.

అయితే వీటిలో ఏపీకే ప్యూర్(APK Pure) బాగా పాపులర్ అయ్యింది.ఓల్డ్ వెర్షన్ అప్లికేషన్ లతోపాటు గూగుల్ ప్లే స్టోర్ లో దొరకని అనేక అప్లికేషన్లు ఈ వెబ్ సైట్ లో గాని ఏపీకే ప్యూర్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా గానీ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అయితే టెక్నాలజీ నిపుణులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి తప్ప ఇతర థర్డ్ పార్టీ అప్లికేషన్ల నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకూడదని ఎప్పట్నుంచో చెబుతున్నారు.కాగా ఇప్పుడు ఏపీకే ప్యూర్ అనే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ లో మాల్ వేర్ ఉందని ప్రముఖ మాల్ వేర్ చెకర్ అయిన కాస్ప‌ర్‌స్కై యొక్క అధికారులు వెల్లడించారు.

ఈ అప్లికేషన్ లో ఉన్న మాల్ వేర్ కారణం ఆండ్రాయిడ్ వినియోగదారుల వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేత తస్కరించబడుతుందని… అలాగే మొబైల్ ఫోన్ లో అవాంఛనీయ ప్రకటనలు ప్రత్యక్షమవుతాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.ఒకవేళ ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ యూజర్ల మొబైల్ ఫోన్ లలో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telugu Android, Apk Pure App, Delete, Security, Google Store, Kaspersky, Malware

ఇదిలా ఉండగా.ఏపీకే ప్యూర్ డెవ‌ల‌పర్లు తమ అప్లికేషన్ లో లోపాలు ఉన్నాయని కానీ వాటిని కొద్ది నెలల క్రితమే పరిష్కరించామని.ఇప్పుడు తమ అప్లికేషన్ లో ఎటువంటి మాల్ వేర్ లేదని చెబుతున్నారు.ఎటువంటి అభద్రతా భావం లేకుండా వినియోగదారులు తమ అప్లికేషన్ వినియోగించుకోవచ్చని ఏపీకే ప్యూర్ డెవ‌ల‌పర్లు చెబుతున్నారు.

కానీ డిజిటల్ సెక్యూరిటీ అన్ని పనులు మాత్రం థర్డ్ పార్టీ అప్లికేషన్ల తో చాలా జాగ్రత్తగా ఉండాలని.సాధ్యమైనంత వరకు వాటిని అస్సలు వినియోగించకూడదని వినియోగదారులకు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube