ఆండ్రాయిడ్ 13 కొత్త అప్డేట్స్ ఇవే..!

Google I/O 2022లో ఆండ్రాయిడ్ 13 (Android 13) బీటా రెండో వెర్షన్‌ను టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది.ఆండ్రాయిడ్‌ మొబైళ్లు, ట్యాబ్లెట్లతో పాటు మరిన్ని డివైజ్‌ల కోసం దీన్ని లాంచ్ చేసింది.

 Android 13 New Features And Updates Details, Android 13, New Features, Latest Ne-TeluguStop.com

మరికొన్ని నెలల్లో ఆండ్రాయిడ్‌ 13 స్టేబుల్ వెర్షన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా గూగుల్ విడుదల చేయనుంది.ఆ తర్వాత సపోర్ట్ చేసే అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పాటు డివైజ్‌లకు క్రమంగా ఆండ్రాయిడ్‌ 13 అప్‌డేట్‌ వస్తుంది.

Android 13లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి.ముఖ్యంగా ప్రైవసీతో పాటు లుక్ కూడా చాలా మెరుగవుతుంది.

సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది.ఇలా ఆండ్రాయిడ్‌ 13లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఇవే.

1.ప్రస్తుతం యాప్‌కు స్టోరేజ్ యాక్సెస్ ఇవ్వాలంటే “ఫైల్స్ అండ్ మీడియా” మొత్తం పర్మిషన్‌ను యాక్సెప్ట్ చేయాల్సిందే.

దీని ద్వారా ఆ యాప్‌ మీ స్టోరేజ్ అంతా యాక్సెస్ చేయగలుగుతుంది.అయితే ఆండ్రాయిడ్‌ 13లో అవసరమైన వీడియో, ఫొటో / మ్యూజిక్, ఆడియోకు మాత్రం పర్మిషన్ ఇచ్చేలా ప్రైవసీ ఫీచర్ వస్తుంది.

2.ఆండ్రాయిడ్‌ 13లో విభిన్నమైన కలర్ స్కీమ్స్ ఉంటాయి.

వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఓఎస్ నుంచి వాల్‌పేపర్స్, స్టైల్ వరకు ఆ కలర్ థీమ్‌లోకి మారిపోతాయి.డిఫరెంట్ లుక్ వస్తుంది.

3.అలాగే మెసేజింగ్ యాప్ లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇందుకోసం గూగుల్ నెట్ వర్క్ ఆపరేటర్లు, ఫోన్ తయారీ కంపెనీలతో కలిసి పనిచేయనుంది.మెసేజస్ ప్రయివసీని పెంచేందుకు ఆండ్రాయిడ్ 13లో గూగుల్ మెసేజింగ్ లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ను పరిచయం చేశారు.

Telugu Android, Androidcolor, Android Ups, Google, Latest, Launch-Latest News -

4.ఒక్కో యాప్‌కు ఇష్టమైన లాంగ్వేజ్ ను సెలెక్ట్ పిక చేసుకునేలా ఆండ్రాయిడ్‌ 13లో ఫీచర్ రానుంది.అంటే ఓ యాప్‌కు తెలుగు, మరో యాప్‌కు ఇంగ్లిష్.ఇలా విభిన్న యాప్‌లకు విభిన్న భాషలను సెట్ చేసుకోవచ్చు.

5.ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో తొలిసారి యాప్‌ ఇన్‌స్టాల్ చేస్తే, అవసరాన్ని బట్టి ఆ యాప్‌ కెమెరా, మైక్రోఫోన్, బ్లూటూత్, కాంటాక్ట్స్ లాంటి పర్మిషన్లను కోరుతుంది.

అయితే రానున్న కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో నోటిఫికేషన్ల కోసం కూడా ఇన్‌స్టలేషన్ సమయంలోనే పర్మిషన్ కోరుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube