అతి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12.. కొత్త ఫీచర్ల విషయానికి వస్తే..!

గూగుల్ సంస్థ తయారుచేసిన ఆండ్రాయిడ్ ఓఎస్ మనం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ లలో అనేక విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టింది.ప్రతి ఏడాది సరి కొత్త ఫీచర్లను తయారు చేసి గూగుల్ సంస్థ విడుదల చేస్తోంది.

 Android 12 Coming Soon When It Comes To New Features ! Android 12, Phones, New F-TeluguStop.com

గత ఏడాది ఆండ్రాయిడ్ 11 వెర్షన్ ని అందుబాటులోకి తెచ్చింది.ఈ వెర్షన్ లో చాట్ బబుల్స్, నోటిఫికేషన్ సైడ్ బార్, ఎస్టిమేటెడ్ చార్జింగ్ అప్ టైం, ఇన్ బిల్ట్ స్క్రీన్ రికార్డర్, సరికొత్త మీడియా కంట్రోల్స్, డార్క్ థీమ్ షెడ్యూల్ లతో సహా నోటిఫికేషన్ హిస్టరీ వంటి ఎన్నో ఉపయోగకరమైన ఫ్యూచర్లను గూగుల్ సంస్థ అందించింది.

ఐతే ఈ ఏడాది ఆండ్రాయిడ్ 12 వెర్షన్ ని అందుబాటులోకి తేవడానికి రెడీ అయిపోతుంది.ప్రస్తుతానికి డెవలపర్ ప్రివ్యూ ని గూగుల్ సంస్థ విడుదల చేసింది.

దీంతో ఆండ్రాయిడ్ 12 కి సంబంధించిన కొన్ని ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి.అవి ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

1.

మీడియా ఫార్మాట్స్

ఆండ్రాయిడ్ 12 తో ఇకనుంచి స్మార్ట్ ఫోన్లు AV1 ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ (AVIF) ని సపోర్టు చేయనున్నాయి.ఇది JPEG వంటి ఫార్మాట్లతో పోల్చినప్పుడుఅదే ఫైల్ సైజుతో మెరుగైన ఇమేజ్ క్వాలిటీ అందిస్తుంది.ఈ సరికొత్త ఫార్మాట్ క్లీనర్ కంప్రెషన్‌తో వస్తుంది కాబట్టి త్వరలోనే JPG ఇమేజ్ ఫార్మాట్‌ ని పక్కకి నెట్టి ఇదే AVIF ఫార్మాట్ ఆండ్రాయిడ్ స్టాండర్డ్ ఇమేజ్ ఫార్మాట్ అయ్యే అవకాశం ఉంది.

2.నోటిఫికేషన్స్

ప్రస్తుతం ఆండ్రాయిడ్ 11 లో నోటిఫికేషన్లు ఎలా వస్తున్నాయో ఆండ్రాయిడ్ 12 లో కూడా అచ్చం అదే పరిమాణం తో నోటిఫికేషన్లు వస్తాయి.కానీ ఆండ్రాయిడ్ 12 లో లేఅవుట్ తో పాటు నోటిఫికేషన్ లో ఉన్న టెక్స్ట్ ఫాంట్ సైజు పెరుగుతుంది.

ప్రస్తుతం నోటిఫికేషన్ల లో ఫాంట్ సైజు చాలా చిన్నగా ఉంది కాబట్టి దానిని పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Android, Ups-Latest News - Telugu

3.డబుల్ ట్యాప్:

డబుల్ టాప్ చేసి స్క్రీన్ షాట్ తీయడం, గూగుల్ అసిస్టెంట్ ని యాక్టివేట్ చేయడం, ఇంకా ఎన్నో టాస్క్ లను చేసే వెసులుబాటును ఆండ్రాయిడ్ 12 కల్పించనున్నది.

Telugu Android, Ups-Latest News - Telugu

4.హాప్టిక్-కపుల్డ్ ఆడియోతో మ్యూజిక్, గేమింగ్

మొబైల్ అప్లికేషన్లు హాప్టిక్-కపుల్డ్ ఆడియో ఫీడ్ బ్యాక్ టెక్నాలజీతో వినియోగదారులకు ఫోన్ వైబ్రేటర్ ద్వారా మంచి గేమ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఆడియో ఎక్స్పీరియన్స్ కల్పించనున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube