అలిగిన ఆండ్రియా

హీరోయిన్‌గా నటించగానే కాదు, ఆ సినిమా ప్రమోషన్‌లో ప్రాముఖ్యత లభిస్తేనే ఆ హీరోయిన్‌కు గుర్తింపు వచ్చేది.అందుకే సినిమాలో నటించిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్‌లో ముందు ఉండాలని కోరుకుంటారు.

 Kamal Convinced Andrea For Uttama Villain Promotion-TeluguStop.com

తనను ప్రమోషన్‌లో పక్కకు పెట్టారనే కోపంతో హీరోయిన్‌ ఆండ్రియా అలిగింది.వివరాల్లోకి వెళ్తే.

కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ‘ఉత్తమ విలన్‌’ సినిమాలో హీరోయిన్స్‌గా పూజా కుమార్‌ మరియు ఆండ్రియాలు నటించారు.ఈ సినిమా ప్రమోషన్‌ పోస్టర్స్‌లో ఎక్కువగా పూజా కుమార్‌నే చిత్ర యూనిట్‌ సభ్యులు చూపడం జరిగింది.

దాంతో ఆండ్రియాకు కోపం వచ్చిందట.

తనను ప్రమోషన్‌కు దూరం పెట్టారు అనే కోపంతో విడుదల సమయంలో మీడియా ముందుకు వచ్చేందుకు నో చెప్పింది.

తాజాగా తెలుగు వర్షన్‌ ‘ఉత్తమ విలన్‌’ కోసం హైదరాబాద్‌లో ప్రమోషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఆ కార్యక్రమానికి తాను రాను అంటూ ఆండ్రియా పేచీ పెట్టిందట.

యూనిట్‌ సభ్యులు ఎంతగా బతిమిలాడినా కూడా ఫలితం లేకుండా పోయింది.చివరకు కమల్‌ హాసన్‌ మాట్లాడి ఆమెను ఒప్పించినట్లుగా తెలుస్తోంది.

ఇకపై ప్రమోషన్‌లో ఆమెకు కూడా సమానమైన స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాతో తెలుగులో బ్రేక్‌ను సాధించాలని ఆండ్రియా కోరుకుంటోంది.మరి ఈమె ప్రయత్నం సక్సెస్‌ అయ్యేనో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube