హీరోయిన్లకు వేశ్య పాత్రలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది.దానికి కారణం లేకపోలేదు.
వేశ్య పాత్ర అయితే, గ్లామర్ కి గ్లామర్ ఒలకపోయవచ్చు, నటనకి నటన చేయొచ్చు.ఇలాంటి అరుదైన కాంబినేషన్ వేశ్య పాత్రలో దొరుకుతుంది.
అందుకే, వేశ్య పాత్రంటే చాలు ఎగేసుకోని వచ్చేస్తారు.
తెలుగులో ఇప్పటికే, అనుష్క, ఛార్మి లాంటి కథానాయికలు ఇటు యువతను ఆకట్టుకుంటూనే, అటు విమర్శకులని సంతృప్తిపరిచారు వేశ్య పాత్రతో.
ఇప్పుడు తమిళనాడుని వేశ్య పాత్రతో మెప్పించే ప్రయత్నంలో ఉంది ఆండ్రియా జెర్మియా.
తడాఖా, యుగానికి ఒక్కడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ఆండ్రియా, తమిళనాట బాగా బీజిగా అయిపోయింది.
ఇంతకీ ఈ భామ ఏ చిత్రంలో వేశ్య పాత్ర చేస్తోందో చెప్పనేలేదు కదూ.సినిమా పేరు వడ చెన్నయ్.హీరో ధనుష్, హీరోయిన్ సమంత.ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ అవనుందండోయ్.