నా లవ్ బ్రేక్ అప్ కి కారణం సుచి లీక్స్ అంటున్న హీరోయిన్  

Andrea Jeremiah Responds On Suchileaks - Telugu Andrea Jeremiah Responds On Suchi Leaks, Kollywood, South Cinema, Tollywood

గాయనిగా కెరియర్ ప్రారంభించి తరువాత హీరోయిన్ అవతారం ఎత్తి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ఆండ్రియా.తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలు చేసి సత్తా చాటింది.

 Andrea Jeremiah Responds On Suchileaks

అయితే ఆమె జీవితంలో హీరోయిన్ గా వచ్చిన గుర్తింపు కంటే అనిరుద్ తో నడిపిన ప్రేమాయణంతో మరింత పాపులర్ అయ్యింది.ఇక వారిద్దరికి సంబందించిన రొమాంటిక్ ఫోటోలని సింగర్ సుచిత్ర సుచి లీక్స్ పేరుతో అప్పట్లో బయట పెట్టింది.

ఇవి తమిళనాట సంచలనంగా మారాయి.ఆమె సుచి లీక్స్ పేరుతో హీరోయిన్స్, హీరోల అఫ్ స్క్రీన్ రొమాన్స్ ఫోటోలు పెట్టి పెద్ద దుమారమే రేపింది.

నా లవ్ బ్రేక్ అప్ కి కారణం సుచి లీక్స్ అంటున్న హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

ఆ ఫోటోలపై తరువాత అందరూ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తాజాగా నటి ఆండ్రియా కూడా ఆ ఫోటోలపై క్లారిటీ ఇచ్చింది అనిరుధ్ కి నాకు ఉన్న సంబంధం నిజమే.

కానీ అవి చాలా పాత ఫోటోలు.మా మధ్య అలాంటి సంబంధం ఉండేది.నిజాన్ని నేను కూడా దాచలేదు.సీక్రెట్ గా ఉండాల్సినవి బట్టబయలు కావడమే బాధగా ఉంది.

అనిరుధ్ తో నాకు మంచి బాండింగ్ ఉంది.లవ్ లాంటిది కాదు కానీ మంచి బంధమే ఉంది.

ఇక లిప్ లాక్ ఫొటోస్ గురించి నేనేం మాట్లాడదల్చుకోలేదు.ఎందుకంటే అవి లీక్ అయిన వెంటనే అనిరుధ్ నన్ను క్షమాపణ అడిగాడు.

అవన్నీ అనిరుధ్ కి తెలియకుండా జరిగాయని కూడా నాకు వివరించాడు.ఆ తర్వాత మా ఇద్దరికీ బ్రేక్ అప్ అయింది.

మొత్తానికి సుచి లీక్స్ కారణంగా అనిరుద్ తో ఉన్న సీక్రెట్ రిలేషన్ బయటపడిపోవడంతో ఆండ్రియా చాలా ఇబ్బంది పడినట్లు ఆమె మాటల బట్టి తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Andrea Jeremiah Responds On Suchileaks Related Telugu News,Photos/Pics,Images..