మాస్టర్‌పై మండిపడుతున్న పిశాచి పాప!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ మాస్టర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.సంక్రాంతి కానుకగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 Andrea Jeremaiah Angry On Master Movie, Andrea Jeremaiah, Vijay, Master, Pisasu-TeluguStop.com

ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.దీంతో ఈ సినిమాలోని నటీనటులకు అదిరిపోయే హిట్ దక్కిందని ప్రేక్షకులు అంటున్నారు.

కానీ ఈ సినిమాలో నటించిన ఓ బ్యూటీ మాత్రం మాస్టర్ చిత్రం పేరు చెబితేనే గుర్రుమంటోంది.

తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అందాల భామ ఆండ్రియా జెరీమియా మాస్టర్ చిత్రంలో విజయ్‌కు చాలా సన్నిహితంగా ఉండే పాత్రలో నటించింది.

అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి అనుకున్నదానికంటే చాలా తక్కువగా ఉందని, అంతేగాక ఆమె పాత్ర ప్రాముఖ్యతను కూడా చిత్ర దర్శకుడు తగ్గించాడని ఆండ్రియా అభిమానులు మండిపడుతున్నారు.ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆండ్రియా కూడా ఇప్పుడు ఈ సినిమా చేసినందుకు బాధపడుతున్నట్లు చెబుతోంది.

అసలు ఇలాంటి పాత్ర ఆమె ఎందుకు చేసిందా అని ఆమె అభిమానులు ఆమెను ప్రశ్నిస్తుండటంతో అమ్మడికి చిర్రెత్తుకొస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో భవిష్యత్తులో ఏ స్టార్ హీరో చిత్రం అయినా సరే, తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే ఆ సినిమాలో నటించేది లేదని ఆండ్రియా తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఆండ్రియా దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న పిశాచి సీక్వెల్ చిత్రం ‘పిశాచి-2’లో నటిస్తోంది.ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని ఆమె చెబుతోంది.

మరి భవిష్యత్తులో స్టార్ హీరోల చిత్రాల్లో నటించేందుకు ఆండ్రియా ఎలాంటి కండీషన్ పెడుతుందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.ఏదేమైనా మాస్టర్ చిత్రంలో నటించిన ఆండ్రియాకు ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యిందని విమర్శకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube