తన విధ్వంసకర బ్యాటింగ్ ‌తో కెమెరాను పగలగొట్టిన డాషింగ్ బ్యాట్స్ మెన్…!  

Andre Russell Hits Camera With batting, Andre Russeell, Practice, IPL2020, Viral Video, Kolkata Knight Riders, mumbai indians - Telugu Andre Russeell, Andre Russell Hits Camera With Batting, Ipl2020, Kolkata Knight Riders, Mumbai Indians, Practice, Russel, Viral Video

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఎట్టకేలకు యూఏఈ దేశంలో మొదలైంది.ఇకపోతే నేటి వరకు అన్ని టీమ్స్ వారి మొదటి మ్యాచ్ ఆడగా ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని కోల్కత నైట్ రైడర్స్ నేడు ముంబై ఇండియన్స్ తో వారి జర్నీ మొదలు పెట్టబోతోంది.

TeluguStop.com - Andre Russeell Hits Camera Ipl2020 Practice

ఇక కోల్కతా బ్యాట్స్మెన్, వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు రస్సెల్ భీకరమైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.నేడు ఐపీఎల్ 2020 సీజన్ నేపథ్యంలో 5వ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.

ఈ మ్యాచ్లో సత్తా చూపించేందుకు విధ్వంసకర బాట్స్ మెన్ రస్సెల్ తీవ్రంగా చెమటోడుస్తున్నాడు.వారి ప్రాక్టీస్ సెషన్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఇక తాజాగా ప్రాక్టీస్ సెషన్ లో తన బ్యాటింగ్ పవర్ తో ఏకంగా కెమెరా ని పగలు కొట్టేసాడు రస్సెల్.ఇందుకు సంబంధించిన ఓ వీడియో కోల్కతా నైట్ రైడర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

TeluguStop.com - తన విధ్వంసకర బ్యాటింగ్ ‌తో కెమెరాను పగలగొట్టిన డాషింగ్ బ్యాట్స్ మెన్…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.ఇక ఈ వీడియోకి ‘ లాస్ట్ షాట్ వరకు వేచి ఉండండి.

కండబలం ఉన్న రస్సెల్ చెలరేగేందుకు ఎలా సిద్ధమవుతున్నాడో ‘ చూడండంటూ క్యాప్షన్ ను జతచేశారు.

ఇక ఐపీఎల్ 2019 సీజన్ లో ఆండ్రూ రస్సెల్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో అందరికీ గుర్తుండే ఉంటుంది.

తన బ్యాటింగ్ తో ఓడిపోయే మ్యాచ్ ను కూడా ఒంటిచేత్తో గెలిపించే సత్తా గల వ్యక్తి రసూల్.ఇదే ఫామ్ ని మరోసారి రిపీట్ చేయాలని ఆత్రంగా వేచి చూస్తున్నాడు అతను.

దినేష్ కార్తీక్ కెప్టెన్ గా ఉన్న కలకత్తా నైట్ రైడర్స్ ఈసారి టైటిల్ ఎలాగైనా గెలిచే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.కోల్కత్తా నైట్ రైడర్స్ లో అటు జూనియర్స్, ఇటు సీనియర్స్ తో సమతూకంగా ఉంది.

చూడాలి మరి గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంటుందో లేకపోతే కలకత్తా నైట్ రైడర్స్ ను ఓడకొట్టి మొదటి విజయాన్ని అందుకుంటుందో మరి.

#Andre Russeell #Viral Video #AndreRussell #Practice #IPL2020

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Andre Russeell Hits Camera Ipl2020 Practice Related Telugu News,Photos/Pics,Images..