ఏపీని ఏకమొత్తంగా చూడకుండా ఎక్కడికక్కడ విభజించి తమదైన రాజకీయ లబ్ధిపొందాలనేది వైసీపీ ప్లాన్.అందుకు మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చింది.
దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనడంలో సందేహం లేదు.అందుకే వైసీపీ తన వైఖరి మార్చుకోవట్లేదు.
ఇంకా ఆ మూడు ముచ్చట నుంచి భయటపడట్లేదు.మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అని వైసీపీ మూడేండ్లుగా ఊరిస్తూ వస్తోంది.
కానీ, ఏ ఒక్క చోట కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు.ఇదే క్రమంలో ఏపీకి రాజధాని లేదంటూ విమర్శలొస్తున్నాయి.
ఈనేపథ్యంలో కోర్టు తీర్పుతో ఏపీకి అమరావతే రాజధాని అని చాటిచెప్పినట్టయింది.ఒకవేళ వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇందుకు భిన్నంగా తీర్పు వచ్చే ఛాన్సు లేదని సమాచారం.
అయినా వైసీపీ మాత్రం మూడు రాజధానుల విషయం విడిచిపెట్టట్లేదు.
రాజకీయ లబ్ధికి మూడు రాజధానుల అంశం కీలకమని భావించి మంచి రోజు చూసుకుని సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది.
తీర్పు ఎలా వచ్చినా ప్రజల్లో టీడీపీపై అసమ్మతి రాజేసేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ అత్యంత వెనుకబడి ఉన్నాయని, రాజధానులుగా చేసి అభివృద్ధి చేద్దామని వైసీపీ అనుకుంటే టీడీపీ అడ్డుపడుతోందని ప్రచారం చేసి టీడీపీకి వ్యతిరేకత వచ్చేలా చేయడానికి యత్నిస్తోంది.
అయితే అమరావతి సెంటిమెంట్ మిగిలిన చోట లేదు.ఎందుకంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ ఉద్యమాలు చేపట్టేవారు కానీ, అది జరగలేదు.
అయినా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దామంటే టీడీపీ అడ్డుతగులుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
అయితే 2024 ఎన్నికల నాటికి వీటన్నింటిని ఆయుధంగా మలుచుకుని రాజకీయంగా ఎదగాలని చూస్తున్నట్టు సమాచారం.అయితే అక్కడ అభివృద్ధి ఎంతమేర చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ అమరావతి రాజధానిగానే ఉంటే పరిస్థితి ఏంటనే సందేహం తలెత్తుతోంది.
మొత్తంగా ఆ మూడు అంశాలు అంటే నిధుల కొరత, నిరాసక్తత, పూర్తి రాజకీయం చుట్టూ వైసీపీ తిరుగుతోంది.ఇలా వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశంపై గళం విప్పేలా కనిపిస్తోంది.