గతేడాది కంటే ఈ ఏడాది అధిక రుణాలు -సీఎం జగన్  

Andra pradesh, cm jagan, state level bankers committee, deputy cm dharmana krishna das, - Telugu Andra Pradesh, Cm Jagan, Deputy Cm Dharmana Krishna Das, State Level Bankers Committee

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‎బీసీ) సమావేశం జరిగిందది.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్‎బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.

 Andra Pradesh Cm Jagan State Level Bankers Committee

బ్రహ్మనందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గతేడాది కంటే ఈ ఏడాది అధిక రుణాలు -సీఎం జగన్-Latest News-Telugu Tollywood Photo Image

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.2020-21 సంవత్సరంలో రుణాల లక్ష్యం రూ.2,51,600 కోట్లు అని తెలిపారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.78 శాతం అధికమని స్పష్టం చేశారు.వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలను అందిచడమే లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు.సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ.39,600 కోట్ల రుణాలు, విద్యా రుణాలు రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాలు రూ.9,710 కోట్లు, సోషల్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ రుణాలు రూ.410 కోట్లు, పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగానికి రూ.454 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.ఇక ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని భావిస్తుండగా.ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలు ఇవ్వడమే లక్ష్యమని అన్నారు.

#Andra Pradesh #CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Andra Pradesh Cm Jagan State Level Bankers Committee Related Telugu News,Photos/Pics,Images..