ప్రతి మండలానికి ఓ కోల్డ్ స్టోరేజీ..!

రాష్ట్రంలో వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.గురువారం తాడేపల్లిలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 Andra Pradesh, Cm Jagan, Cold Storage, Godowns, Minister Kannababu-TeluguStop.com

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.రూ.4 వేల కోట్ల నిధితో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

రైతులు పంటలు నిల్వ చేసేందుకు వీలుగా ప్రతి మండాలనికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మించాలని భావిస్తున్నామని అన్నారు.

రైతుల తనతో పంట ఉందన్న విషయం రైతు భరోసా కేంద్రం అధికారులకు తెలిపిన వెంటనే సెంట్రల్ సర్వర్‎కు చేరాలని జగన్ స్పష్టం చేశారు.ప్రతి ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) పరిధిలో గోడౌన్లు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్ర పరికరాలు అందుబాటులో ఉండాలని సూచించారు.

రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటును ఇవ్వాలని కోరారు.కనీస గిట్టుబాటు లేని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని వివరించారు.ఇక సెప్టెంబర్ నెలనాటికి దీనికి సంబంధించిన సాఫ్ట్‎వేర్ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube