ఏపీలో హంగ్ వస్తుందా రాదా ... లెక్కలేసుకునే పనిలో పార్టీలు  

ఏపీ లో రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి..? హంగ్ ఏర్పడుతుందా ..? అనే సందేహాలు ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు ఉండబోతోంది. వాటి ఆధారంగా పార్టీల భవితవ్యం ఏంటనేది తేలనుంది. ఇప్పటివరకు ఏపీలో హంగ్ అనే మాటే వినిపించలేదు. కానీ అనూహ్యంగా జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ దూసుకురావడం, ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో హంగ్ అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

Andra Pradesh All Parties Wants Hang In Their Parties-

Andra Pradesh All Parties Wants Hang In Their Parties

ఇక ఏపీలో అనేక పార్టీలు ఈసారి పోటీలో ఉండబోతున్నాయి. టీడీపీ నుంచి విడిపోవడంతో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ కూడా తన ఉనికిని చాటుకునేందుకు సిధ్ధపడుతోంది. మరో వైపు వామ పక్షాలూ ఉన్నాయి. ఇంకా ఇతర పార్టీలూ రేసులో ఉన్నాయి. పోటీ టీడీపీ, వైసీపీ అయినా ఇతర పార్టీలూ కొన్ని చోట్ల ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

ఇంకో వైపు జనసేనాని పవన్ తాను తప్పక సీఎం అవుతానంటున్నారు. ఆయన ఆశలూ హంగ్ పైనే ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కర్ణాటక ఫలితల్లాగే ఇక్కడ కూడా వస్తాయి. అక్కడ కుమారస్వామి పాత్ర నేను పోషిస్తాను అనే ఒకరకమైన ఫీలింగ్ లో ఉన్నాడు. ఇక కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి ఈ మాట తరచూ హంగ్ గురించే మాట్లాడుతున్నాడు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ హంగ్ రానే రాదని, మరో సారి చంద్రబాబు మంచి మెజారిటీతో సీఎం అవుతారని గట్టిగా చెబుతోంది.

Andra Pradesh All Parties Wants Hang In Their Parties-

ఇంకో వైపు వైసీపీ అదే మాట అంటోంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హంగ్ ప్రసక్తే లేదని విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏపీలో ఏ పార్టీ సర్కార్ ఏర్పాటు చేయాలన్నా 175లో సగానికి కంటే ఎక్కువ సీట్లు అంటే 88 రావాలి, దాన్ని మ్యాజిక్ ఫిగర్ అంటారు. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఎవరూ తెచ్చుకోలేకపోతే కర్ణాటక లో ప్రస్తుతం ఉన్న పరిస్థితే ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.