ఆ స్వామి అలా చెప్పడంతో .. ముహూర్తం మార్చుకున్న జగన్ ?

తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను బయటపెట్టినా వైసీపీ అధినేత జగన్ మాత్రం అవేవి పట్టించుకోవడంలేదు.ఏపీలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 Andhrapradesh New Cm Ys Jagan-TeluguStop.com

అంతకు ముందే ఫలితాల ప్రకటన అనంతరం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టించేసుకున్నాడు.ఆ లెక్క ప్రకారం ఈ నెల 26 న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నాయకులు హడావుడి చేశారు.

అయితే ఇప్పడూ ఆ ముహూర్తం కాస్తా మరింత వెనక్కి వెళ్ళింది.

ఎన్నికల ఫలితాలు 23 వస్తాయి.

ఆ తరువాత అంటే మే 30న ప్రమాణస్వీకారం చేయాలని జగన్ నిర్ణయించుకున్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.అసలు జగన్ ఈ ముహూర్తం మార్చుకోవడానికి కారణం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామేనట .ఆయన సలహా ,సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది.కొంతకాలంగా ఇటువంటి విషయాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న జగన్, ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారట.

-Telugu Political News

స్వరూపానంద ఫిక్స్ చేసిన ముహుర్తాన్ని పాటించేందుకు ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిటింగ్ చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.అదే రోజు జగన్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని మెజార్టీ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ఇక ఫలితాలు వచ్చిన తరువాత వారం రోజుల పాటు జాతీయ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై వైసీపీ అధినేత దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఏదైతేనేమి జగన్ మాత్రం తానే సీఎం అని ఫుల్ క్లారిటీతో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube