పలకరింపులు పర్యటనలు ! సిద్దమవుతున్న జగన్  

Ys Jagan Wants To Start Palakarimpu Paryatanalu In Ap-

అధికారం చేతికి వచ్చేసింది.తాను అనుకున్నట్టుగానే ఏపీలో పరిపాలన అంతా సాగిపోతోంది.మంత్రుల ఎంపిక దగ్గర నుంచి పథకాల అమలు వరకు అంతా అనుకున్నది అనుకున్నట్టుగానే సాగిపోతోంది.ఎన్నికల్లో తాను హామీ ఇచ్చిన ‘నవరత్నాల’ పథకం చక్కగా అమలవుతోంది.

Ys Jagan Wants To Start Palakarimpu Paryatanalu In Ap- Telugu Viral News Ys Jagan Wants To Start Palakarimpu Paryatanalu In Ap--YS Jagan Wants To Start Palakarimpu Paryatanalu In AP-

దీనికి బడ్జెట్లో నిధులను కూడా కేటాయిస్తున్నాడు.నవరత్నాలకే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జనానికి మరింత దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు.

జగన్ రెండు నెలల పాలన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ప్రస్తుతానికి జగన్ చాలా హ్యాపీగానే ఉన్నాడు.మరికొన్ని పథకాలకు శ్రీకారం చుట్టేందుకు చూస్తున్నాడు.పనిలో పనిగా తన పరిపాలనపై ఎప్పటికప్పుడు నిఘా నివేదికలు తెప్పించుకుంటూ బేరీజు వేసుకుంటున్నాడు.

Ys Jagan Wants To Start Palakarimpu Paryatanalu In Ap- Telugu Viral News Ys Jagan Wants To Start Palakarimpu Paryatanalu In Ap--YS Jagan Wants To Start Palakarimpu Paryatanalu In AP-

ఈ నేపథ్యంలో జగన్ మరో కొత్త కార్యక్రమాన్నీ అమలు చేసేందుకు సిధ్ధం అవుతున్నాడు.ఇకపై ప్రతీ జిల్లాలో పర్యటించాలన్నది జగన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది.

జగన్ అధికారం చేపట్టిన తరువాత ఇప్పటివరకు ఒక్క కడప జిల్లాకు తప్ప ఎక్కడా పర్యటించలేదు.అందుకే ఇప్పుడు మిగతా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకుని వారి వారి సమస్యలను తెలుసుకుని మరింత మెరుగైన పరిపాలన అందించాలని జగన్ చూస్తున్నాడు.

దీనికోసం ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం జగన్ ఆగస్టు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది.

ఆగస్ట్ 1 నుంచి 4 వరకూ విదేశీ పర్యటనలో భాగంగా జెరూసలం కుటుంబంతో సహా వెళ్తున్న జగన్ ఆగస్ట్ 16 నుంది 22 వరకూ అమెరికా పర్యటనకు షెడ్యూల్ రూపొందించుకున్నాడు.ఈ రెండు పర్యటనల తరువాత జిల్లాల టూర్లకు జగన్ సిద్ధమయ్యేందుకు చూస్తున్నాడు.

ఈ పర్యటనలను రాజకీయాలకు సెంటిమెంట్ గా భావించే శ్రీకాకుళం నుంచి ప్రారంభించాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడట.ఉత్తరాంధ్రలో బాగా వెనకబడిన సిక్కోలుని తన జిల్లా పర్యటనలకు ఎంచుకోవడం ద్వారా జగన్ శ్రీకాకుళం జిల్లా ప్రాధాన్యతలు, అభివృద్ధి విషయంలో అక్కడే ఒక అవగాహనకు వచ్చి ఆ తరువాత మిగతా జిల్లాల్లో పర్యటించాలని జగన్ ఆలోచన చేస్తున్నాడట.

.

తాజా వార్తలు

Ys Jagan Wants To Start Palakarimpu Paryatanalu In Ap- Related....