బిజెపి నై... టిఆర్ఎస్ కు జై ! గ్రేటర్ లో ఆంధ్రుల ఓట్లు ఇలా ?

చెప్పుకోవడానికి గొప్ప విజయం కాకపోయినా, తెలంగాణలో టీఆర్ఎస్ 56 సీట్లతో సత్తా చాటుకుంది.ఇక బిజెపి సైతం గతంతో పోలిస్తే బాగానే బలం పుంజుకుంది.

 Andhra Settlers Who Voted In Favor Of Trs, Greter Poling Results, Bjp, Ktr, Kcr,-TeluguStop.com

నాలుగు సీట్ల నుంచి 48 సీట్ల వరకు బిజెపి తన స్థాయిని పెంచుకో గలిగింది.అయితే గ్రేటర్ ఎన్నికలలో విజయం టీఆర్ఎస్ వైపు  నిలబడింది.

ఇది ఇలా ఉంటే టిఆర్ఎస్ లో ఆంధ్ర ఓటర్ లు సైతం కీలకంగా మారారు.ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి , జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో మాత్రం బిజెపి పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

ఒకవేళ ఆ ప్రాంతాల్లో బిజెపి హవా నడిచి ఉంటే గ్రేటర్ లో సమీకరణాలు మరో విధంగా ఉండేవి.టిఆర్ఎస్ కు మించిన స్థాయిలో బిజెపి సీట్లు సాధించి, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకునేది.

అయితే ఆ అవకాశం లేకుండా పోయింది.మొదటి నుంచి ఆంధ్ర ఓటర్లు అంతా టిడిపి వైపు నిలబడుతూ వుండేవారు.

ఇక మరికొందరు వైసిపికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు.మొదటి నుంచి టిడిపి కి అనుకూలంగా ఉండే ఓటర్లు బిజెపికి ఓటు వేయకపోవడం వెనుక అమరావతి అంశం కారణంగా ప్రచారం జరుగుతోంది.

Telugu Ghmc, Greter, Hyderabad Andra, Ysrcp-Telugu Political News

ఆంధ్రలో బిజెపి వ్యవహారశైలిపై ఆగ్రహం గా ఉండడం తోనే సెటిలర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని ప్రచారం జరుగుతోంది.ఇక వైసీపీ అనుకూల ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపక పోవడానికి అనేక కారణాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.గ్రేట్ లో బిజెపి బలం పుంజుకుని విజయం దక్కించుకుంటే ,  ఇక ఆ తరువాత ఆంధ్ర పై పూర్తి గా ఫోకస్ పెంచి వైసీపీ ని ఇబ్బంది పెడుతుంది అని, అలా జరగకుండా ఉండాలంటే, బిజెపి గెలవ కూడదు అని లెక్కలు వేసుకోవడంతో.అటు తెలుగుదేశం ఇటు వైసిపి ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపారు అనే విషయం ఇపుడు ప్రచారం జరుగుతోంది.

అయితే ఆంధ్ర ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.

ఆంధ్ర, తెలంగాణ విడిపోయినా, హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల విషయంలో టీఆర్ఎస్ అనుకూలంగా ఉంటూ వస్తోందని, ఎప్పుడు ఎక్కడ ఆంధ్రులను ఇబ్బంది పెట్టే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించలేదని, అందుకే ఆంధ్ర సెటిలర్ లు అంతా, టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని టిఆర్ఎస్ చెప్పుకుంటోంది.

ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల ఫలితాల విషయంలో ఆంధ్ర ఓటర్లు కీలకం కావడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube