ప్రధాన నగరాలే పరిశుభ్రతలో పూర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఇష్టపడే, ఎక్కువగా పర్యటించే ఆంధ్రలోని రెండు నగరాలు స్వచ్చ భారత్ లో బాగా వెనుకబడ్డాయి.ఆ రెండు నగరాలు విజయవాడ, విశాఖపట్నం.

 Andhra Pradesh’s Poor Show In Swachh Bharat Rankings-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చ భారత్ రాంకులలో విశాఖకు 205 రాంకు వచ్చింది.విజయవాడకు 266 రాంకు లభించింది.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం అయ్యేంతవరకు విజయవాడ నుంచే పాలన సాగాలి.ఇప్పటికే కొన్ని కార్యాలయాలు అక్కడికి తరలించినట్లు చెబుతున్నారు.

చంద్ర బాబు క్యాంప్ ఆఫీసు కూడా సిద్ధమైంది.వారంలో నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటానని చెబుతున్నారు.

ఇక విశాఖను ఏపీ ఆర్ధిక రాజధాని అంటున్నారు.ఇది అందమైన నగరం.

సినిమా వారికి ఇష్టమైన సిటీ.రాబోయే కాలంలో పారిశ్రామిక కేంద్రంగా అవుతుందని చెబుతున్నారు.

కాని క్లీన్ సిటీల జాబితాలో బాగా వెనుకబడ్డాయి.ఈ నగరాలను స్మార్ట్ నగరాలుగా చేస్తామన్నారు.

ఇంత ప్రాధాన్యం ఉన్న వాటిని బాబు ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు.బాబు విదేశాల్లో పరిశుభ్రత గురించి మాట్లాడుతున్నారని, కాని రాష్ట్రంలో పట్టించుకోవడంలేదని విమర్శించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube