డర్టీ హరి పై కేసు నమోదు చేయండంటున్న మహిళా కమిషన్‌ చైర్ ‌పర్సన్....

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాత మరియు దర్శకులు ఎమ్మెస్ రాజు “డర్టీ హరి” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో చిత్ర యూనిట్ సభ్యులు  ఈ చిత్రాన్ని ఈ నెల 18వ తారీఖున ఆన్ లైన్ లో విడుదల చేశారు.

 Andhra Pradesh Women's Commission Chairperson Vasireddy Padma Complaint Against-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో నూతన హీరో శ్రవణ్ రెడ్డి హీరోగా నటించగా యంగ్ బ్యూటీ రుహాణి శర్మ మరియు సిమ్రత్ కౌర్ తదితరులు హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ చిత్రం ప్రస్తుతం సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ చిత్రంపై కేసు నమోదు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ “వాసిరెడ్డి పద్మ” పోలీసులను కోరింది.ఇందుకు గల కారణాలను తెలియజేస్తూ ఈ చిత్రం యొక్క వాల్ పోస్టర్లు కొంతమేర అసభ్యకరంగా అశ్లీలతను ప్రదర్శిస్తున్నాయని అందువల్లనే చిత్ర యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిజిపి గౌతమ్ సవాంగ్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అయితే ఇప్పటివరకు పోలీసులు మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

Telugu Andhra Pradesh, Andhrapradesh, Apwomens, Dirty Hari, Guntur, Raju, Vasi P

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఏదైనా సరే మనం చూసే తీరు మరియు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుందని అంతే తప్ప ఇందులో ఎలాంటి అశ్లీలత లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో చూడాలంటే 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.కాగా ఈ చిత్రం విడుదల చేసిన మొదటి రోజే దాదాపుగా కోటి రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.

అంతేగాక గత కొద్దికాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న దర్శకుడు ఎమ్మెస్ రాజు కి మంచి హిట్ ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా వాల్ పోస్టర్లు అశ్లీలత ప్రదర్శిస్తున్నాడని వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం స్పందించలేదు.

మరి కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube