మగపిల్లాడి కోసం మూడోసారి గర్భం.. చివరికి?

సాధారణంగా ఎవరికైనా కవల పిల్లలు పుట్టడం సహజమే.అది కూడా మొదటి కాన్పులో లేదా కొన్ని కొన్ని సందర్భాలలో రెండవ కాన్పు లో పుడుతుంట‌ారు.

 Andhra Pradesh Woman Gives Birth To Triplets In Madanapalli Of Chittoor District Here Are The Details-TeluguStop.com

ఇలా జరగడం సహజమే.ఇక మరి కొన్ని చోట్ల అయితే ఒకేసారి ఇద్దరు పిల్లలు కాకుండా.

ముగ్గురు లేదా నలుగురు పుట్టిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.చాలా వరకు ఇలాంటివి మొదటి కాన్పు లోనే జరుగుతుంటాయి.

 Andhra Pradesh Woman Gives Birth To Triplets In Madanapalli Of Chittoor District Here Are The Details-మగపిల్లాడి కోసం మూడోసారి గర్భం.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఒక మహిళకు మూడోసారి గర్భం దాల్చగా అక్కడ జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

గుర్రంకొండ కు చెందిన శివకుమార్ – స్వర్ణలత అనే దంపతులు.

వీరికి ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది.ఇక వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.

కొడుకు కోసం మూడవ సారి గర్భం దాల్చింది.దీంతో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం ఉదయం 108 వాహనం ద్వారా చిత్తూరు జిల్లా మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

కానీ ఆసుపత్రి కి చేరే వరకు మధ్యలోనే పురిటి నొప్పులు ఎక్కువగా అవ్వడంతో ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది.

ఇక అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించగా గానే.

అక్కడ మరో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.ఈ ఘటనను చూసి వైద్యులు షాక్ అవగా.

మూడో కాన్పు లో ఓకే సారి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదైన విషయమని వైద్యులు తెలుపుతున్నారు.ఇదివరకు ఇదే హాస్పిటల్ లో ఓ మహిళ కూడా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు.

అంతేకాకుండా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం అత్యంత అరుదని వైద్యులు తెలుపుతున్నారు.ఇదిలాఉంటే ఒక్కోసారి నలుగురైదుగురు పిల్లలకు జన్మనిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.

కానీ మూడో కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం మాత్రం చాలావరకు అసాధ్యమని తెలిపారు.

#Andhra Pradesh #Madanapalli #Woman Gives

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు