ఏపీలో కర్ఫ్యూ సమయములో సడలింపులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇస్తూ ఉంది.ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

 Andhra Pradesh State Curfew New Timings-TeluguStop.com

అయితే జూన్ 21వ తారీకు నుండి 30 వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని పొడిగిస్తూ కొత్త సడలింపులు అందిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈరోజు కోవిడ్ సమీక్ష సమావేశం జరిపిన సీఎం జగన్ .వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తో ఉన్నతాధికారులతో భేటీ అయి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.అయితే సాయంత్రం ఐదు గంటల గల దుకాణాలు మూసేయాలి అని .ఆరు గంటల లోపు ఇంటికి వెళ్లిపోవాలని ప్రజలకు సూచించింది.రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయటంతో.

 Andhra Pradesh State Curfew New Timings-ఏపీలో కర్ఫ్యూ సమయములో సడలింపులు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా వరకు కరోనా కట్టడి చేయగలిగినట్లు.మెరుగైన ఫలితాలు రాబట్టినట్లు ఈ సమావేశంలో మంత్రులతో.

ఉన్నతాధికారులతో సీఎం జగన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ప్రస్తుతం అమలవుతున్న టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు టైమింగ్స్ కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

#ApCurfew #Ap Curfew #Morning6 #Andhra Pradesh #Alla Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు