సచివాలయాలకి వేసినవి అసలు వైసీపీ రంగులే కాదంట

ఏపీలో గత ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ఊహించని విధంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ అధినేత జగన్ పాలన మొదలు పెట్టినప్పటి నుంచి అన్నింటా తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు.అందులో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు.

 Andhra Pradesh Sachivalayam Colors Of Ysrcp-TeluguStop.com

అక్కడి నుంచే గ్రామస్థాయిలో అధికారుల ద్వారా నేరుగా పాలన సాగేలా చూస్తున్నారు.ఇప్పటికే గ్రామ సచివాలయాలు చాలా వరకు ప్రారంభామైపోయాయి.

అయితే పరిపాలన వరకు ఒకే కాని ఆ సచివాలయాలకి, స్కూల్స్ కి పార్టీ రంగులు వేయడం కోసం జగన్ ఏకంగా వందల కోట్లు ఖర్చు పెట్టారు.

దీనిపై కొందరూ హైకోర్టులో పిటీషన్ వేశారు.

దీనిని విచారించిన హైకోర్టు సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.దీనిపై ప్రభుత్వం తరుపున లాయర్ హైకోర్టు ముందు ప్రభుత్వ వాదన వినిపించారు.

ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ పార్టీ రంగులు ఎందుకు వేసారని ధర్మాసనం ప్రశ్నించగా అవి అసలు వైసీపీ రంగులు కాదని చెప్పడం విశేషం.అయితే జగన్ ఫోటో ఎందుకు ముద్రించారని తిరిగి ప్రశ్నించారు.

రాజ్యాంగ పదవిలో ఉన్నందుకు అతని ఫోటోలు వేయడం జరిగిందని తెలిపారు.దీనిపై ధర్మాసనం ప్రభుత్వ లాయర్ కి అక్షింతలు వేసి రాజ్యాంగ పదవిలో ఉన్నవారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల మీద ముద్రించొచ్చు అంటూ లోక్ సభ, సుప్రీం కోర్టుపై మోడీ బొమ్మలు కూడా వేసుకోవచ్చా అని ప్రశ్నించారు.

ఇలాంటి వాదనలు వినిపించకుండా దీనిపై సరైన సమాధానం చెప్పాలని ఆదేశించారు.మొత్తానికి ఇప్పుడు హైకోర్టులో రంగుల వ్యవహారం కాస్తా ఆసక్తికరంగా మారి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube