రాజధాని రగడ మళ్లీ మొదటికొచ్చేందే ?  

Andhra Pradesh Rajadhani In The State Is An Issue-andhra Pradesh Rajadhani,chandrababu Naidu,tdp,ys Jagan,ysrcp

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాజధాని విషయంలో ఎక్కడలేని గందరగోళం నెలకొంది.రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక మారే ప్రాంతానికైనా మారుస్తారా అనే విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు.

Andhra Pradesh Rajadhani In The State Is An Issue-Andhra Chandrababu Naidu Tdp Ys Jagan Ysrcp

కానీ ఏపీ పురపాలక మంత్రి బొత్స మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలో రాజధాని ఉండదన్నట్టుగా మాట్లాడి వివిధం లేపారు.దీనిపై ఎక్కడలేని రాజకీయ రగడ చెలరేగింది.ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అమరావతి నిర్మాణంపై ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది.

దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్త్ర్హం అవుతున్నాయి.రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే కమిటీ ఏర్పాటు చేశామమని ప్రభుత్వం ప్రకటిస్తోంది.

Andhra Pradesh Rajadhani In The State Is An Issue-Andhra Chandrababu Naidu Tdp Ys Jagan Ysrcp

రాజధానిగా అమరావతి ఎట్టిపరిస్థితుల్లోనూ పనికిరాదనే విషయాన్ని ఈ కమిటీ ద్వారా జగన్ చెప్పించబోతున్నారని ప్రతిపక్షాలు అప్పుడు విమర్శలు మొదలుపెట్టాయి.

  అమరావతిపై జగన్ ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని నియమించింది.ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉంటారు.

వీరంతా పట్టణాభివృద్ది రంగంలో నిపుణులే.రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి అనేక సూచనలు, సలహాలు కూడా ఈ కమిటీ ఇవ్వబోతోంది.

ఈ కమిటీకి ఆరువారాల గడువుని కూడా ప్రభుత్వం విధించింది.ఇక ఈ సంగతి అలా ఉంచితే అమరావతి కోసం ప్రతిపక్షాలు పెద్ద పోరాటాన్నే ఎత్తుకున్నాయి.

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కూడా అనవసర గందరగోళం నెలకొంది.వారిలో కొంతమంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు.

పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో పర్యటించి రాజధానిని మార్చాలనుకుంటే ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధమంటూ ప్రకటించారు.

 

ఎక్కడ ఎన్ని విమర్శలు చెలరేగినా వైసీపీ ప్రభుత్వం వైకిరి మాత్రం రాజధానిగా అమరావతి మాకు అమోగ్యమే కాదన్నట్టుగా ప్రకటనలు చేస్తూనే వచ్చింది.ఈ మధ్యనే ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధర్నాధ్ రెడ్డి మనకు ప్యారిస్ వంటి రాజధాని అవసరమా అంటూ ప్రశ్నించారు.ఇటీవల సింగపూర్‌లో పర్యటించిన ఆయన నిర్మాణానికి నిధులు లేవని ప్రకటించి సంచలనం రేపారు.

ఈ పరిణాల నేపధ్యంలో రాజధాని నిర్మాణంపై అందరికి సందేహాలు పెరిగిపోయాయి.కానీ ఇప్పుడు ప్రభుత్వం అధ్యయన కమిటీ వేయడంతో అమరావతి భవిష్యత్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రాజధాని విషయంలో జగన్ విజన్ ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి అమరావతి నిర్మాణంపై నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

ఈ కమిటీ రాజధానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి రాజధానిలో ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలను ఏమి చేయబోతున్నారు ? మధ్యలో ఆగిన నిర్మాణాల పరిస్థితి ఏమిటన్న విషయంపై నిపుణుల కమిటీ తమ నివేదికలో తేల్చబోతోంది.కాకపోతే రాజధానిని తరలించే ఆలోచనతోనే కొత్తగా ఈ కమిటీ పేరుతో నాటకాలాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

తాజా వార్తలు

Andhra Pradesh Rajadhani In The State Is An Issue-andhra Pradesh Rajadhani,chandrababu Naidu,tdp,ys Jagan,ysrcp Related....